E-Book

Hasyanandam March 2021

Pl, Share This >>

హాస్యానందం
అభిమానులకు.. ఆప్తులకు.. సన్నిహితులకు
హాస్యాభివందనాలు.

ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఉండాలి. వ్యక్తిగతమైన ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది. మనం కొందర్ని చూసి స్పూర్తి పొంది కొన్ని పనులు చేస్తుంటాం. మనం స్పూర్తి పొందిన ” ఆ వ్యక్తి దానికి అర్హులో కాదో ముందుగా ” తెలుసుకోవాలి. అంతేకానీ ఎవర్ని పడితే వారిని ”స్ఫూర్తిప్రదాతలు’ చేసేయొద్దు! ‘స్ఫూర్తిప్రదాతలు’ అనేది గొప్ప మాట! మనకు సహాయం చేసారనో… మనం కష్టాల్లో ఉంటే మనకు అండగా ఉన్నారనో వారిని ‘స్పూర్తి’ గా తీసుకోవటం తప్పు కాదు గానీ… మన ‘విజ్ఞతతో’ ఆ వ్యక్తి నుంచి ఏం స్పూర్తి పొందామో మనకి మనం ప్రశ్నించుకోవాలి! ఒకరి వలన ప్రభావితమై తీసుకునే నిర్ణయాలు మనకంటూ ఓ ‘వ్యక్తిత్వం’ లేకుండా చేస్తుంది. మన చదువులు, లోకజ్ఞానం, మనం చూసిన, చూస్తున్న ప్రపంచం మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. వాటిలో మంచి చెడులను బేరీజు వేసుకుని మంచిని ఆచరిస్తూ అదే మన ‘వ్యక్తిత్వం’ అనేలా ప్రవర్తిస్తే మనకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. నా ఉద్దేశం ‘స్పూర్తి’ పొందవద్దని కాదు. దానికి వారి అర్హత పరిగణలోకి తీసుకోండి! మన అనుభవాలే మనకి మార్గదర్శకాలుగా అనుసరిద్దాం! మనకంటూ ఓ వ్యక్తిత్వం ఏర్పరచుకుందాం!

అందరూ ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..

Ramu-Sign
Hasyanandam-March-2021


Pl, Share This >>

Leave a Reply