Feel Good Thoughts
ఆనందానికి.. అరవై ఆలోచనలు
హాస్యానందం ముచ్చటైన ముందుమాటలు..
మన ఆలోచనే.. మన ఆనందం! ఆనందం ఎక్కడో లేదు.. మన చేతల్లోనే ఉందని చెప్పడమే నా యీ అరవై ఆలోచనలు!
నవ్వు ఆనందానికి తొలి మెట్టు! నవ్వించడం కోసమే వెలువడుతున్న హాస్యానందం పత్రికలో ప్రతినెలా నవ్వించడమే కాకుండా మనం ఆనందంగా ఎలా ఉండాలి అనే అంశాలపై ‘హాయ్… సానందంగా…’ అంటూ నేను రాసిన ‘ఎడిటోరిల్స్’ సమాహారమే ఈ “పుస్తకం!
చిన్న చిన్న విషయాలలో నిర్లక్ష్యం వలన మనం ఏం కోల్పోతున్నామో చెప్పడమే నా ఉద్దేశం. మనల్ని ఎవరైనా అభినందించినా.. మెచ్చుకున్నా.. మనం ఎంతగా ఆనందిస్తామో.. ఎదుటివారి పట్ల మనం ‘అలాగే’ ప్రవర్తిస్తే అనుబంధాలు ఆరోగ్యకరమైన ఆనందాన్ని ఇస్తాయి!
మధుర మనస్వీ డా|| కె.వి. రమణగారి ముందుమాట నాకు ఆశీస్సులు.
చిన్నప్పట్నుంచి నేను అభిమానించే రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అభిప్రాయం, నా ఆలోచనలకు నైతిక బలాన్నిచ్చింది.
అందరివాడు మా తనికెళ్ళభరణి నా గురించి రాసిన అక్షరాంజలి నా ఉనికిని చాటింది.
ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించే ‘కళారత్న’ బ్నింగారి మాటలు నా పట్ల ఆయనకున్న అభిమానికి నిదర్శనం.
ఇక ఈ పుస్తక ప్రచురణ విషయంలో నాకు చేదోడుగా ఉన్న మా డా॥ కప్పగంతు రామకృష్ణగారి స్నేహితం.. నా ఆనందానికి కారకులైన వీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
నా జీవితసహచరి భవాని ఉద్యోగ విరమణ, సందర్భంగా ప్రచురించిన ఈ పుస్తకం నీతి వాక్యాలు కావు గానీ, మీరు ఆనందంగా ఉండటానికి ఈ ఆలోచనలు పనికొస్తే నా ప్రయత్నం ఫలించినట్లే!
-రాము పాండా, ఎడిటర్. హాస్యానందం
..Full Book PDF Coming Soon..
