Cartoonist RamSeshu Cartoons Book
రామ్ శేషు కార్టూన్లు
మంచి కార్టూనిస్టుల్లో ఒకరు రామ్ శేషు!
కార్టూన్ పరమావధి నవ్వించడమే. ఆ నవ్వించడంలో కొన్ని కార్టూన్లు మాత్రమే సఫలీకృతమవుతాయి.
నూరుశాతం సఫలీకృతంగా నవ్వించే కార్టూన్లు వేసే కార్టూనిస్ట్ మన రామ్ శేషు. హాస్యానందంతో మొదటి నుంచి అనుబంధమున్న కార్టూనిస్టు శ్రీరామ్ శేషు. ఈయన ‘కార్టూల్ని’ గమనిస్తే ఒకప్పటి.. నేటీ.. ఈయన ‘గీతల్లో’ ఎదుగుదల కనిపిస్తుంది. కార్టూనిస్ట్ కి ఉండాల్సిన ముఖ్యం లక్షణం ఇది. తన గీతల్ని ‘ఇంప్రూవ్’ చేసుకుంటూ… ఐడియాల్ని ‘షార్ప్’ చేసుకుంటూ ముందుకు సాగాలి… ఈ క్రమంలో హాస్యాన్ని మిస్ చేయకూడదు… ఈ ‘అన్ని’ ప్రక్రియలు సక్రమంగా నిర్వహిస్తున్న కార్టూనిస్టు రామ్ శేషు గారు.
ప్రఖ్యాత కార్టూనిస్టు శ్రీ జయదేవ్ గారు తమ ‘జయదేవ్ రాజలక్ష్మి కార్టూన్ అకాడమీ’లో ప్రచురిస్తున్న నాలుగో పుస్తకం ఇది. తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి కార్టూను మిమ్మల్ని నవ్విస్తుంది.. చాలా కార్టూన్లు నవ్విస్తూనే ఆలోచింపచేస్తాయి. ఈ కార్టూన్లును చూసాక నా మాటలతో మీరు ఏకీభవిస్తారు. మనకుండే మంచి కార్టూనిస్టుల్లో ఒకరైన రామ్ శేషు గారికి, ఈ పుస్తక ప్రచురణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
-రాము,పి ఎడిటర్, హాస్యానందం.

పుస్తకం పేజీలు 112 | వెల రూ.200/- QR పై చెల్లించి ఆర్డర్ చేయండి.

