Cartoonist Gandhi Cartoons Book
మనోహరాలు- గాంధీ కార్టూన్లు
గ్యారంటీ నవ్వుల కార్టూనిస్టు-గాంధీ!
‘కార్టూనిస్ట్ రామకృష్ణ ఫౌండేషన్’ ప్రచురిస్తున్న మూడవ నవ్వుల పుస్తకం ఇది.
ప్రతియేట బాపుగారి పుట్టిన్రోజు, డిశంబర్ 15న, ఒక కార్టూనిస్టు కార్టూన్ల సంకలనం విడుదల చేయడం ఒక మంచి సంప్రదాయంగా వస్తోంది. తోటి కార్టూనిస్టులను ఎంతగానో ప్రేమించే మన రామకృష్ణగారు మన మధ్యలేక పోయినా ‘ఆ ప్రేమని’ పంచుతున్నారు ఆయన తనయ శ్రీమతి సునీత గారు. ఈ యేడాది ప్రముఖ కార్టూనిస్టు శ్రీగాంధీగారి కార్టూన్ల సంకలనం విడుదల కావటం సంతోషకరమైన విషయం. ఈయన పేరులోని ‘మనోహరం’ ఈయన కార్టూన్లలో ప్రస్పుటమవుతుంటుంది. ఎలాంటి అసభ్యత లేని ఐడియాలతో…గందరగోళంగా లేని గీతలతో గాంధీగారి కార్టూన్లు నవ్విస్తాయి. ఇక గాంధీగారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే…‘ఆ’ గాంధీగారు ఎంత సౌమ్యులో నాకు తెలియదు గానీ మా గాంధీగారు మాత్రం సౌమ్యత్వానికి చిరునామా అని చెప్పగలను. ఈ సందర్భంగా గాంధీ గారికి
అభినందనలు.
‘కార్టూనిస్ట్ రామకృష్ణ ఫౌండేషన్’ నిర్వహిస్తున్న ఈ నవ్వుల యజ్ఞంలో ‘హాస్యానందం’ ఓ భాగమవటం అదృష్టంగా భావిస్తోంది. తండ్రికి తగ్గ తనయ శ్రీమతి సునీత మునగపాటిగారు, మన రామకృష్ణగారి ఆశయాన్ని నెరవేరుస్తున్నందుకు… ఆవిడకు మనఃపూర్వక అభినందనలు.
-రాము,పి

పుస్తకం పేజీలు 112 | వెల రూ.150/- QR పై చెల్లించి ఆర్డర్ చేయండి.

