E-Book

Hasyanandam February 2024 E Book

Pl, Share This >>

హాయ్…సానందంగా..
హాస్యానందం అభిమానులకు… ఆప్తులకు… హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!

జీవితం చాలా విలువైనది.. క్షణకాలంలో మారిపోయేది కూడా!.. కానీ ఆ మారిపోయే ‘క్షణం’ మన చేతులారా చేసుకునేది కాకూడదు కదా?
ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పొప్పులు అటుంచితే మూల్యం చెల్లించాల్సింది మాత్రం మనమే! ‘హెల్మెట్ పెట్టుకోండి.. సీట్ బెల్ట్ పెట్టుకోండి.. మాస్క్ పెట్టుకోండి..’ ఈ మాటలన్నీ మన కోసమే, మన రక్షణ కోసమే.. అన్న విషయం చాలామంది పట్టించుకోరు. రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే సందులు గొందులు వెతుక్కుంటూ తప్పించుకునే మనం రోడ్డు మీద తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే అకస్మాత్తుగా జరిగే ‘ప్రమాదం’ నుండి తప్పిచుకోలేము. రోడ్డు మీదకు వచ్చామంటే తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. అవి మన రక్షణ కోసమే అని గ్రహించాలి.
జరగకూడనివి జరిగితే మన కోసం ఎదురుచూసే మన కుటుంబం పరిస్థితి ఏమిటీ? రోడ్డు మీద అందరం ‘నాకేమీ కాదులే అనుకునే వాహనాల మీద ప్రయాణం చేస్తుంటాం! దురదృష్టవశాత్తు ఎదుటివాని నిర్లక్ష్యం వలన కూడా ఏమైనా జరిగితే.. మనం పాటించే ‘ఈ’ జాగ్రత్తల వలన మన ప్రాణాలు కాపాడుకునేవాళ్ళమౌతాము.

ఆ మధ్య ఒక ప్రముఖ నటుని ఇంట రెండు రోడ్డు ప్రమాదాలు జరిగి.. తరువాత వచ్చిన అతని సినిమాల ముందు ‘ప్రయాణాల్లో’ జాగ్రత్త’ అని ప్రకటన మనం చూస్తూనే ఉన్నాం! సినిమాల విషయానికొచ్చాం కాబట్టి.. పొగత్రాగకండి.. మద్యం సేవించకండి అని ప్రకటన చూస్తుంటాం.. నిజంగా ఇవి హాస్యాస్పందంగా ఉండే ప్రకటన. ఎందుకంటే ‘పొగ’ గురించి నాలుగు, ఐదు సంఘటనలు చెప్పే ఈ ‘వ్యవస్థ’, ‘మద్యం’ గురించి ఎందుకు చర్చించటం లేదు?.. మద్యం వలన జరిగే పరిణామాలు ఎందుకు చూపించటం లేదు?!

కాబట్టి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి! ఎవరు మంచి చెప్పినా మనకోసమేనని గుర్తెరిగి ప్రవర్తించాలి! ఇక ‘మాస్క్’.. ‘కరోనా’ వలన ఏర్పడిన ఈ ‘జాగ్రత్త’.. జాగ్రత్త పడే వారిలో ఇప్పుడు ఇది ఒక భాగమైపోయింది. ఇది కరోనా కోసమే కాదు.. ప్రస్తుత ‘కాలుష్యం’ దృష్ట్యా కూడా ‘సురక్షిత’మైనది.

ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని.. విలువైన మన జీవితాల్ని ఆనందమయం చేద్దాం!

అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని
కోరుకుంటూ..


Hasyanandam-February-2024

 


Pl, Share This >>

Leave a Reply