E-Book

Hasyanandam March 2024 E Book

Pl, Share This >>

హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!

ఆనందం ఎవరికి వద్దు?!.. ఆనందం కోసం ఒకొక్కరిది ఒకొక్క మార్గం.. కొంతమందికి తమకిష్టమైన ‘పనులే’ జీవనాధరమైనప్పుడు ఆ ‘ఆనందమే’ వేరు. అలాగే కొంతమంది తమ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబాల్లో అయితే బంధువులతో, వ్యక్తిగతంగా అయితే స్నేహితులతో కలిసి తమ ఆనందాల్ని పంచు కుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మన ‘ఈ’ ఆనందాలు పంచుకోవటానికి వచ్చిన వాళ్ళ సంగతేంటి?.. వాళ్ళూ మనతో మన ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆనంది స్తున్నారా? ఇక్కడే మొదలవుతుంది అసలు సమస్య!

పిలిచేంత వరకు బాగానే ఉన్నా.. అక్కడికి చేరుకున్న తరువాత విఐపిలు అంటూ.. స్పెషల్ అతిథిలంటూ కొంతమందికే మనం ఇచ్చే ప్రాధాన్యత ఇతరులకు చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆనందం పొందడం తరువాత మాట, బాధ మాత్రం మిగులుతుంది.

మన కోసం వచ్చిన వాళ్లంతా విఐపిలే! మనం పిలిస్తేనే ‘వీళ్ళూ’ వచ్చారు. ఇక్కడ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. పిలిచి మర్యాద చేయలేకపోవచ్చు కానీ అక్కడ ఉండే ప్రముఖులను మాత్రమే పట్టించుకుని మిగతావాళ్ళని ‘లెక్క’ చేయకపోవటం పెద్ద తప్పే! ఆ ప్రముఖులు పది నిముషాలు ఉండి వెళ్ళిపోతారు.. ‘ఈ’ మిగతా వాళ్ళు మనతో ‘చివరి’ దాక ఉంటారనే సత్యం గ్రహించాలి. వీళ్ళే ‘నిజంగా’ మన ఆనందాన్ని పంచుకుంటారనేది కూడా సత్యం!

ఇక సభల్లో కూడా వచ్చిన వాళ్ళందరూ ముఖ్య అతిథులే! వేదికమీద ఎంతమంది ప్రముఖులు ఉన్నా.. సభలో ఉన్న అందరివల్లే సభ విజయవంతమౌతుంది. అలా అని ‘ముఖ్యుల్ని’ గౌరవించ వద్దని కాదు.. ‘వాళ్ళూ’ మన కోసమే వచ్చారు. పైగా మనకుండే కొద్దిపాటి పరిచయంతో వస్తారు. కాబట్టి వారిని తగువిధంగా గౌరవించి, ప్రాముఖ్యం ఇవ్వాల్సిందే!.. మనం ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని సభలో అయినా, ఇంట్లో అయినా ‘సంబరం’ చేసుకుంటే, మనం ఆనందం పొందటమే కాకుండా.. మన మాట మన్నించి వచ్చిన వారూ కూడా ఆనందంగా పొందుతారు. మరోసారి మన ‘పిలుపు’కి ప్రాముఖ్యమిస్తారు. కాబట్టి వచ్చిన ‘అందరినీ’ గౌరవించటం అనే సూత్రం పాటించాలి. కొంతమందిని ‘ఎక్కువ’గా చూసినా, మిగతావారిని మాత్రం తక్కువగా చూడకూడదు. ఆనందం ఎవరికి వద్దు చెప్పండి!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని


Hasyanandam-March-2024-suryatoons

 


Pl, Share This >>

Leave a Reply