Hasyanandam April 2024 E Book
గెస్ట్ ఎ మినిట్
హాస్యానందం పత్రిక తొలి నుంచీ జీవిత చందాదారుల్లో నేను ఒకడిని. రొటీన్ జీవితాలతో సీరియస్గా ఉండే పాఠకులు కాస్త రిలాక్స్ అవటానికి దోహద పడుతున్న రాముగారు అభినందనీయులు. దానికన్నా ముఖ్యంగా.. పోటీలు పెట్టి, స్పాన్సర్ల నుంచి ఆర్థిక రూపేణా బహుమతులు ప్రకటించి కార్టూనిస్టులకి అంతో ఇంతో ఆర్థిక సహాయం చేస్తున్నవారు! మరో రకంగా చెప్పాలంటే, శ్రమని గుర్తించి, కాసింతైనా ప్రోత్సాహం ఇస్తున్న పత్రిక తెలుగులో ఇదొకటే!
ప్రస్తుతం వారు, వారి తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రచురణ రంగంలో ఉన్న ఒక మహిళకి ‘బంగారు తల్లి’ పురస్కారాన్ని ఇస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న ఈ యజ్ఞంలో ఈ సంవత్సరం భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారిని ఈ పురస్కారానికి ఎన్నుకున్నారు. పబ్లిషింగ్ రంగంలో ఉండే మహిళలకు ప్రోత్సాహం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది. ఈ సందర్భంగా ఆయనకీ, హాస్యానందానికీ, బహుమతి గ్రహీతకీ అభినందనలు.
-యండమూరి వీరేంద్రనాథ్
