Cartoonist Krishna Cartoons Book
కృష్ణ కార్టూన్లు..
నా ఆనందానికి అవధులు లేవు!
నా పేరు కృష్ణ కిషోర్ వల్లూరి. గత 32 సంవత్సరాలుగా ‘కృష్ణ’ పేరుతో దాదాపు 9000 పై చిలుకు కార్టూన్స్ వేశాను. కార్టూన్లు మాత్రమే కాక వెయ్యి వరకు స్టోరీ Illustrations, Cover Designs మొదలగునవి కూడా వివిధ పత్రికలకు చిత్రించాను. అయితే నా ఈ కృషి వెనక చిన్ననాటి నుండి వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు, పెద్దనాన్నగారు శ్రీబాపు (ప్రముఖ చిత్రకారులు, దర్శకులు) గారు ఉన్నారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నా కార్టూన్లు ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 6సార్లు, జాతీయస్థాయిలో 15సార్లు, రాష్ట్రస్థాయిలో 40 వరకు బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే నా చిన్ననాటి నుండి నన్ను కార్టూన్లు, బొమ్మలతో inspire చేసిన బాపు గారితో పాటు శ్రీజయదేవ్ గారు, చంద్రగారు, కరుణాకర్ గారు లాంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు.
అలాగే నాకు బాగా పేరు తెచ్చిన ‘చింటూ కామిక్స్’ 200 వారాలుగా ఆంధ్రభూమి దిన పత్రికలో వచ్చాయి .. అలాగే హైదరాబాద్ L&Tమెట్రో రైలు ప్రాజెక్ట్ కి సంబంధించి హైదరాబాద్ చరిత్రని ‘NIZ కామిక్స్’ రూపంలో 80వారాల పాటు 4 భాషలలో చిత్రించాను. నేను ప్రస్తుతం హైద్రాబాదులో 24 సంవత్సరాలుగా Animation రంగంలో ఉద్యోగం చేస్తూ ఎన్నో సినిమాలకి కూడా పనిచేశాను. చాలా కంపెనీలకి Logoలు, Flyers, Designs, స్టోరీ బోర్డ్స్ Create చేశా. ప్రతీనెల కొన్నిరోజులు JNAFA University లో Visiting Facultyగా వెళ్లి Animation సబ్జెక్టు బోధిస్తూంటాను.
నా విద్యని కొత్త తరానికి నేర్పాలన్న ఉద్దేశ్యంతో వీకెండ్స్‌లో పిల్లలకి డ్రాయింగ్, కార్టూన్లు నేర్పుతున్నా. బొమ్మలు, కార్టూన్స్ ఎలావెయ్యాలి అని చెబుతూ “VALLURI KREATIVES’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాను.
నా ఫామిలీ విషయానికొస్తే భార్య (శైలజ), ఇద్దరు పిల్లలు (అనిరుధ్, అనూహ్య), నాన్న అమ్మ గారు శ్రీవత్సాంకరరావు, సూర్య కుమారి.
నా విద్యాభ్యాసం అంతా అమ్మమ్మ గారి ఊరు ఐన నరసాపురంలో (పశ్చిమ గోదావరి జిల్లా) టేలర్ హైస్కూల్, Y.N.M. కాలేజీలలో M.COM వరకు జరిగింది. మా సొంత ఊరు రాయకుదురు గ్రామం (పశ్చిమగోదావరి జిల్లా). అయితే చాలా కాలంగా నాకు నా కార్టూన్ సంకలనం తేవాలన్న కోరిక ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
ఈ తరుణంలో మా కార్టూనిస్టు లందరికీ గురుతుల్యులు, నాకెంతో ఇష్టమైన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీజయదేవ్ గారు ఫోన్ చేసి, ఈ సంవత్సరం రాజలక్ష్మి ఫౌండేషన్ ద్వారా నీ కార్టూన్ సంకలనం వేద్దామను కుంటున్నాం, అని చెప్పేసరికి నా ఆనందానికి అవధులు లేవు.
ఇలా శ్రీజయదేవ్ గారి ద్వారా నా కార్టూన్ సంకలనం రావటం నా జీవితంలో మరపురాని జ్ఞాపకంగా ఉంటుందనుటలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా గురుతుల్యులు శ్రీజయదేవ్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా గురించి ముందు మాటలు రాసిన ప్రముఖ రచయిత శ్రీబ్నింగారికి, ప్రముఖ సినీ కమెడియన్ శ్రీ సుదర్శన్ గారికి, ఎంతో శ్రమతో నా కార్టూన్ సంకలనాన్ని అందంగా తీర్చిదిద్దిన, హాస్యానందం రాము గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
–విధేయుడు
కృష్ణ (కృష్ణ కిషోర్ వల్లూరి) కార్టూనిస్ట్, హైదరాబాద్ 9247192410

పుస్తకం పేజీలు 112 | వెల రూ.200/- QR పై చెల్లించి ఆర్డర్ చేయండి.

