E-Book

Hasyanandam May 2023 E-Book

Pl, Share This >>

హాస్యానందం అభిమానులకు… ఆప్తులకు… హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!

తొలి తెలుగు కార్టూనిస్టు శ్రీతలిశెట్టి రామారావు జన్మదినాన్ని (మే,20) పురస్కరించుకుని గత పన్నెండేళ్ళుగా మహామహుల అండదండలతో హాస్యానందం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ రమణగారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నాం.

ఈ యేడాది మన కార్టూనిస్టులు మంచి మంచి కార్టూన్లతో ఈ పోటీలో పాల్గొన్నారు. కార్టూనిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు.
ఈ పండగ హైదరాబాద్, రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్ లో మే, 20న జరుగుతుంది.

ఈ కార్టూనిస్టుల పండుగ వైభవంగా జరగడానికి ముఖ్య కారకులు డా||కె.వి. రమణగారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

అలానే హాస్యానందం పై తమ అభిమానం చాటుకుంటూ ఈ మహోత్సవానికి వన్నె తెస్తున్న తెలంగాణరాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణగారికి, శ్రీ తనికెళ్ళ భరణిగారికి, ‘సత్కళాభారతి’ శ్రీసత్యనారాయణగారికి, ‘బాపురమణ అకాడమీ’ సుబ్బరాజుగారికి, ఈ కార్యక్రమాల సమన్వయకర్త శ్రీబ్నిం గారికి… అతిథులుగా పాల్గొంటున్న శ్రీఅక్కిరాజు సుందర రామకృష్ణగారికి, శ్రీ ఎల్బీ శ్రీరాంగారికి, శ్రీ లంక లక్ష్మీనారాయణగారికి మృత్యుంజయగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

హాస్యానందంపై అపారమైన అభిమానం చూపిస్తున్న కార్టూనిస్టులకు, రచయితలకు రచయిత్రులకు, చందాదారులకు, జీవిత చందాదారులకు, ముఖ్యంగా గురుతుల్యులు ‘స్వాతి’ సంపాదకులు శ్రీ వేమూరి బలరామ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా హాస్యానందంలో రెగ్యులర్గా పాల్గొంటున్న కార్టూనిస్టుల గత యేడాది ప్రచురించిన 58 కార్టూన్లతో ప్రత్యేక సంచిక రూపొందించడం జరిగింది.

ఎప్పట్లానే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ.. మీ అభిరుచికి అనుగుణంగా పత్రికని రూపొందించడానికి కృషి చేస్తాను అని తెలియజేస్తూ..

అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..

Ramu-Sign
Hasyanandam-May-2023-E-Book

 


Pl, Share This >>

Leave a Reply