Hasyanandam July 2023 E-Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!
Experience is the best master… ఇది ఓ ఆంగ్లసామెత! మన ముందుతరం వారి అనుభవాలు మనకి చాలా విషయాల్లో మార్గదర్శకం అవుతాయనేది సత్యం. అయితే సమస్యల్లా పెద్దవాళ్ళను మనం అడగం.. వాళ్ళేమో అడగకుండా చెప్పటం ఏమిటని చెప్పరు. పొరపాట్లు, తప్పులూ చేసుకుపోతుంటాం. అందరికీ అన్ని విషయాలు తెలియవు. తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకోవటం తప్పు కాదు! ఏ పనులకు పర్యవసానం ఎలా ఉంటుందనేది అనుభవంతో తెలుసుకున్న వారి సూచనలు మనకెంతో దోహదపడతాయి.
ఉదాహరణకి ఒక ఆఫీసులో కొత్తగా చేరిన ఆఫీసర్ కంటే ఒక సీనియర్ క్లర్క్ గొప్పగా పనులు చేయగలడు.. ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్పగలడు. అది అనుభవం వలన వచ్చిన నైపుణ్యం. ఒక ఇంటి పెద్ద సలహాలు తీసుకుంటే మనం చేసే పనులు చాలా సులువుగా, తొందరగా అయిపోతాయి. అలా చేయటం వలన బంధాలు కూడా బలపడతాయి.
కష్టపడి పనులు చేయడం కాదు… సులువుగా చేయటం ముఖ్యం. ప్రస్తుతం మనం ‘టెక్నాలజీ’ బానిసలం. ‘కంప్యూటర్’ సలహాలతో చాలా పనులు చేస్తున్నాం. అయితే కొన్ని కుదరవు! వాటిని గుడ్డిగా చేసేయకుండా వాటి గురించి మన ‘పెద్ద’లను సంప్రదించి చేయగలిగితే కచ్చితంగా దాని ఫలితం బాగుంటుందనేది నిజం!
అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుని మనం చేయబోయే పనులు విజయవంతంగా పూర్తి చేద్దాం!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
Hasyanandam-July-2023