E-Book

Hasyanandam January 2023 E-Book

Pl, Share This >>

హాస్యానందం అభిమానులకు..
ఆప్తులకు..హాస్యప్రియులకు,
సన్నిహితులకు అంగ్ల నూతన సంవత్సర&
సంక్రాంతి శుభాకాంక్షలు!

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత! ఇప్పుడెంతమంది పాటిస్తున్నారీ సామెతని! ఇప్పుడు మన ఆలోచనా పరిధి పెరిగింది. ధోరణీ మారింది. కాని ఆ ‘పరిధి ఎంత వరకనే విషయం మాత్రం గమనించట్లేదు. ‘ఎవరేమనుకుంటే నాకేం! అన్న ధోరణి పెరిగిపోయింది. నేనేమైనా ఎవరిమీదైనా ఆధారపడి బతుకుతున్నానా?” అనే ‘“డిఫెన్స్‌’ మాటలతో ఎదుటి వాళ్ళను బాధ ‘పెడుతూ సాగే నేటితరం ఆలోచనా ధోరణి వలన కలిగే మనస్తాపం తన దాక వస్తే గాని తెలియదు.

ఇక రెండోరకం.. అందరితో మంచి అనిపించుకోవాలని కిందా మీదా పడుతుంటారు. ఆ క్రమంలో ఎవరి దగ్గరుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఎదుటివాళ్ళను చులకన చేసి మాట్లాడుతూ కాలం గడుపుతుంటారు! వాస్తవంగా అందరినీ మెప్పించటం చాలా కష్టం! కానీ ఏవో ప్రయోజనాల కోసం గోడమీది పిల్లి వాటంలా ప్రవర్తించే వీరు “తీయని” మాటలతో అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు.

ఈ రెండు రకాల మనుషులను గమనిస్తూ మనమెలా ఉండాలో నిర్ణయం తీసుకుందాం! మనం సంఘజీవులం. నా బ్రతుకు నా ఇష్టం అని బ్రతికేయలేము. ఈ రోజు ఎదుటివాళ్ళ అవసరానికి మనం ఉపయోగ పడ్డ.. రేపు మన అవసరానికి వాళ్ళు నిల్చుంటారు. ఇవన్నీ మన సమాజంలో ఏర్పడిన పరస్పర అవగాహనలు.
ఇందులో ఎవరి వలన ఎవరూ బ్రతకరు.. ఎవరూ ఎవరినీ పోషించరు. జస్ట్‌ మనకంటూ ఆప్తులు, సన్నిహితులున్నారనే ధైర్యం.. అంతే!

ఈ రోజు మనదే!.. మరి రేపటి పరిస్థితి?.. కాస్త ఆలోచిద్దాం!..
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా
ఉండాలని కోరుకుంటూ..

Ramu-Sign
Hasyanandam-January-2023


Pl, Share This >>

Leave a Reply