Hasyanandam August 2024 E Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు.. సన్నిహితులకు హాస్యాభివందనాలు!
కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం!
మనం చాలాసార్లు విన్న సామేతే ఇది. కచ్చితంగా ఈ రెండిట్లో ఒకదానికే మనం ‘న్యాయం’ చేయగలం..
ఇక రెండోదాని ఫలితం అనుభవించక తప్పదు.
మనలో చాలా మంది అందరితో మంచి అనిపించుకోవాలని చాలా తాపత్రయ పడుతుంటారు. ఆ క్రమంలో ఎవరి దగ్గరుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఎదుటివాళ్ళను చులకన చేసి మాట్లాడుతూ కాలం గడుపుతుంటారు.

వాస్తవంగా నూరుశాతం అందరినీ మెప్పించటం చాలా కష్టం!
కానీ ఏవో ప్రయోజనాల కోసం గోడమీద పిల్లి వాటంలా ప్రవర్తించే వారు చాలా ప్రమాదకారులు. వాళ్ళు అనుకున్నది అమలు చేయడం కోసం ఎంతకైనా దిగజారుతారు. మన మెప్పు కోసం మనకెంతో సహాయం చేస్తున్నట్లు ప్రవర్తించే వీరి వలన మనం ఇబ్బందులపాలవుతాం!
ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

సాధ్యమైనంతవరకు అటువంటివారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరము.
అలాగని పూర్తిగా దూరం చేసుకోకుండా అంటి ముట్టనట్లు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి!
ఇలా మనం అలాంటివారి పట్ల ‘పరిధి’ ఏర్పాటు చేసుకుంటే మన ఆనందాలకి మనమే కారకులౌతాము. మనకు ఎవరు నిజమైన స్నేహితులో’ గుర్తెరిగి.. ప్రవర్తించే తీరు కచ్చితంగా మనల్ని సంతోషంగా ఉంచుతుంది.
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..

ఎడిటర్, రాము. పి
Hasyanandam-August-2024-suryatoons