Hasyanandam April 2023 E-Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు… హాస్యప్రియులకు సన్నిహితులకు
హాస్యాభివందనాలు!
కలసి వుంటే కలదు సుఖం. సుఖం అన్నదానికి అందరూ ఇష్టపడుతున్నాం… దాని కోసం పరుగెడుతున్నాం… కానీ ఆ ‘కలసి’ వుంటే అన్న ప్రక్రియని విస్మరిస్తున్నాం. ముఖ్యంగా అభిప్రాయ భేదాలతో ఈ మధ్య మనుషులు దూరం కావటం బాధాకరం. అభిప్రాయభేదాలు ఉండటం అంటే శతృత్వం పెంచుకోవటం కాదు! ఒక అంశం మీద ఒకోక్కరికీ ఒకో అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాల్ని వీలుంటే గౌరవిద్దాం! నచ్చకపోతే వదిలేద్దాం! అంతేగానీ మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దీ… నానా రభస చేసి, తోటివారిని దూరం చేసుకోవద్దు!
ఇప్పుడు అందరూ ‘నాదీ’…’నేను’ అనే చట్రంలో ఇరుక్కుని బతుకుతున్నాం. ఉన్న ఆ ‘కాస్త’ బంధాలు, స్నేహాలు… చేతులారా మన మాటే నెగ్గాలనే కారణంగా… నా అభిప్రాయమే కరెక్ట్ అన్న అహంతో తెంచుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచిద్దాం! ఒకవేళ ఏదైన ఒక విషయమై ‘అయినవాళ్ళతో’ వాదనలు పెట్టుకుంటే మాత్రం ఎదుటివాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, మన అభిప్రాయాలు చెప్పాలి! అలానే ఎదుటివారి అభిప్రాయాలు వినాలి! అంతేగానీ అభిప్రాయలు కలవలేదని వారిని ద్వేషించటం… శతృత్వం పెంచుకోవటం అర్ధం లేని చర్యలు! మనల్ని మనం నియంత్రించుకోలేనప్పుడు… ఏదైనా విషయంపై భేదాభిప్రాయాలు ఉంటే… ఆ చర్చకు దూరంగా ఉండటమే శ్రేష్టం! ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ… మన మాటలతో వారిని బాధపెట్టకుండా ఉండే చర్చలు శ్రేయోదాయకాలు!
అందరూ హాయిగా.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..