Cartoons

సుడాన్ to ఇండియా via కర్ణాటక ఎలెక్షన్స్

Pl, Share This >>

“ఆపరేషన్ కావేరి” – సుడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న వేలాదిమంది భారతీయులను క్షేమంగా, స్వదేశానికి తీసుకొచ్చే ఒక సైనిక చర్య. దౌత్య పరంగా అనుకూలత లేకపోవడం, సమయం మించేకొద్దీ అక్కడి యుద్ధ వాతావరణం భయానకంగా మారడం వల్ల. ప్రధాని మోడీ ఇచ్చిన సంపూర్ణ నిర్ణయాధికారం, విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యవేక్షణలో మన త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సహస ఆపరేషన్ ప్రపంచమంతా నివ్వెరపోయేలా చేసింది.

ఒక పక్క మన యుద్ధ విమానాలకు, అక్కడి గగనతలంలో అనుమతి లేకపోయినప్పటికీ, మన వాయుసేన రాత్రికి, రాత్రి రహస్యంగా, చీకట్లో, కేవలం నైట్ విజన్ కళ్ళజోళ్ళ సాయంతో, వాడుకలో లేని ఒక విమానాశ్రయంలో విమానాన్ని దించి, అంతమందిని మనదేశానికి తరలించడం ఒక థ్రిల్లర్ సినిమాను మించిన సాహసమనే చెప్పాలి. అంతకు ముందే, అక్కడి భారతీయులందర్నీ సమీకరించి, బ్లాకులో డీజిలు కొని మరీ బస్సుల్లో ఆ చీకటి విమాశ్రయానికి తరలించడంలో విజయం సాధించిన, మన ఇండియన్ ఎంబసీ ఘనత కూడా చెప్పుకోవాలి.

ఇక్కడ వరకూ మ్యాటర్ సీరియస్, ముగింపు సక్సెస్..! ఐతే, ఇందులో దాగిన కార్టూన్ ఐటమ్ ఏంటంటే..మన ప్రియతమ పబ్లిసిటీ ప్రధాని మోడీ.. దీనికి కర్ణాటకలో పుట్టిన నది “కావేరి” పేరుతో “ఆపరేషన్ కావేరి” అని నామకరణం చేయడం.. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, గెలుపుకి ఒక మంచి సెంటిమెంటు టచ్ ఇవ్వడం.

చూస్తుంటే ఇది “సోగ్గాడు” సినిమా పాట ..చెట్టుమీద కాయనూ – సముద్రంలో ఉప్పునూ.. కలిపినట్టే కలిపి – ఆవకాయ్ పెట్టినట్టు వుందికదా !
చూడాలి మరి, కర్ణాటక ఎన్నికల్లో ఈ “సుడాన్ మేడ్ – కావేరి ఆవకాయ్”తో బీజీపీ ఎంతవరకూ లాభపడుతుందో ! – సూర్య | suryatoons.com


Pl, Share This >>

Leave a Reply