Smile Telugu Cartoons 1997 E-Book
1980-90 దశకాల్లో, మొగుడూ పెళ్ళాలు, పార్కుల్లో ప్రేమలు, అత్తా కోడళ్ళు, అప్పడాల కర్రల చుట్టూ గానుగెద్దులా తిరుగుతున్నా మన తెలుగు కార్టూన్ రంగానికి, ప్రపంచ స్థాయి కార్టూన్లని పరిచయం చేయడానికి ఉదయం మోహన్, చంద్ర, జయదేవ్ మొదలైన వారు గట్టిగా కృషిచేసారు, ఇప్పట్లా ఇంటర్నెట్, గూగుల్ లేనిరోజుల కాబట్టి, ప్రపంచ కార్టూన్లు చూసే అవకాశం లేక, తెలుగు కార్టూనిస్టులు రాతలోనూ,గీతలోనూ తెలుగుతనం చట్రంలోనే ఇరుక్కుని కార్టూన్లు వేస్తుండేవారు. ఆ సమయంలో ఇతరదేశాల పత్రికల్లో వచ్చే కార్టూన్లని, క్యారికేచర్లని,కార్టూనిస్టులని, తెలుగు పత్రికల్లో ఆర్టికల్స్ ద్వారా పరిచయం చేసిన వారిలో ఉదయం మోహన్ ముందుంటారు.
అలాంటి ప్రయత్నంలో భాగంగా, అప్పటి ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శ్యాం మోహన్ కూడా తన “స్మైల్” సంచికల ద్వారా, ప్రపంచ కార్టూన్లని ప్రచురించి, తెలుగు కార్టూనిస్టుల కార్టూన్ ఐడియాల పరిధి పెంచేందుకు స్ఫూర్తి కల్పించారు. అందులో ఒకటి 1997 లో పబ్లిష్ చేసిన ఈ “స్మైల్” – ప్రపంచ కార్టూన్ల ప్రత్యేకసంచిక.
ఈ “ఓల్డ్ ఈజ్ గోల్డ్” ఫచర్ ద్వారా మరోసారి, ఆనాటి కార్టూన్లని చూసి ఎంజాయ్ చేయండి.. _ సూర్య
Smile-1997-Telugu-Cartoons-Book-suryatoons