E-Book

Artist Chandra Special Issue

Pl, Share This >>

హాస్యాభిమానులకు, హాస్యానందం ఆప్తులకు,
కార్టూనిస్ట్లకు, పాఠకులకు హాస్యాభివందనాలు!

ముందుగా మనందరికీ ఇష్టమైన మన ‘బొమ్మర్షి’ బాపుగారికి ‘పద్మశ్రీ’ వరించినందుకు ఆయనకు అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు!

ఇక ఈ సంచిక విషయానికొస్తే గమనమే గమ్యమై సాగుతున్న మన హాస్యానందం మన తెలుగు తేజాలపై పూర్తిగా ఒక ప్రత్యేక సంచికను రూపొందించటం ఆనవాయితీగా పెట్టుకుంది. ఆ పరంపరలో ఈ సంచిక మన ప్రఖ్యాత చిత్రకారులు, కార్టూనిస్ట్, రచయిత, కవి అయిన శ్రీ చంద్రగారిస్పెషల్ సంచికగా రూపొందించాం!

కొంతమంది ‘ఇప్పుడు సందర్భం ఏమిటి?’ అని అడిగారు. దానికి మాదొక్కటే సమాధానం.. మన విశిష్ట వ్యక్తుల ‘విశిష్టత’ చెప్పడానికి ఒక సందర్భం అవసరమా! మనకి సమయం అనుకూలించాలి గాని! తవ్వినకొద్ది ఊరే నీటిలా అన్వేషించిన కొద్దీ మాకు లభ్యమయిన ఆయన ‘కళారూపాలు’ ఈ 48 పేజీల్లో సర్దడానికి నానా అవస్థలూ పడి.. కొండని అద్దంలో చూపించిన విధంగా రూపొందించామని అనుకొంటున్నాం.

ఈ ప్రత్యేక సంచిక రూపకల్పనలో మాకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాము.

శ్రీ చంద్రగారు మరిన్ని ఆహ్లాదకరమైన బొమ్మలు, కార్టూన్లు, రచనలు చేస్తూ.. ఆయురారోగ్యాలతో హాయిగా ఆనందంగా ఉండాలని దేవుణ్ణి హాస్యానందం ప్రార్ధిస్తోంది. అందరూ నవ్వుతూ.. ఆరోగ్యంగా.. ఆనందంగా వుండాలని కోరుకుంటూ..

Artist-Chandra-Special-Issue


Pl, Share This >>

Leave a Reply