Top 5 కామెడీ మేడమ్స్ & ఫన్నీ మొగుడ్స్
నేటి సోషల్ మీడియాలో ఎన్నిరకాల కంటెంట్ వున్నా.. అందులో ఎప్పుడూ ట్రేండింగ్ లో వుండేది మాత్రం..ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇక ఎంటర్టైన్మెంట్ లో సినిమా తర్వాత అదే రేంజ్ లో దూసుకుపోయేది కామెడీ..
అందుకే గల్లీ YouTube చానెల్స్ నుంచి ETv, మల్లెమాల, Maa Tv, Aha OTT లాంటి కార్పోరేట్ కంపెనీలు దాకా..ఈ కామెడీ ప్రోగ్రాంలపై భారీగా పెట్టుబడులు పెట్టి మరీ పోటీ పడుతున్నాయి.
Etv జబర్దస్త్, Extra జబర్దస్త్ లాంటివి ఎంతపెద్ద Hit అయ్యయో మనందరికీ తెలుసు. చివరికి, “ఢీ” లాంటి డ్యాన్స్ ప్రోగ్రాంస్ లో కూడా మెయిన్ కంటెంట్ తోపాటు కామెడీని కూడా పెట్టి ఆకర్షిస్తున్నారు.
అలాగే ఈ కామెడీ ప్రోగ్రంలలో రాణించిన ఆర్టిస్టులు కూడా..క్రమంగా సెలెబ్రిటీలు గామారి, డబ్బు, హోదాలతో వెలిగిపోతున్నారు.
పూర్వం సినిమాల కాలంలో..ఒక రాజబాబు, రమాప్రభ, రేలంగి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రమణారెడ్డి, తర్వాతి తరం బ్రహ్మానందం, సుత్తి వేలు, వీరభద్రరావు, ఆలి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి, మమత, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, రఘుబాబు, దాకా..ఒక మంచి కమెడియన్ గుర్తింపు రావాలంటే.. చాలా కాలం పట్టేది, అది కొనసాగాలేంటే మంచి సినిమా అవకాశాలతో పాటూ, అదృష్టం కూడా ఉండాల్సి వచ్చేది. కానీ నేటి కామెడీ కధ వేరు.. సోషల్ మీడియా పుణ్యమా అని, చిన్న సెల్ ఫోన్ వున్న వారెవరైనా..తమ టాలెంట్ తో ఓవర్ నైట్ సెలెబ్రిటీ అయిపోవచ్చు.
ఉదాహరణకి “బంగారం ఒక్కటి చెప్పనా” “బాదాం..బాదాం..కచ్చాబాదాం” ” జంబలకిడి జారుమిఠాయా”..వగైరా..వగైరా..
అలా అతి తక్కువ టైం లోనే సెలెబ్రిటీ లుగా గుర్తింపు పొందదానికి, ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ YouTube. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సొంత టాలెంట్, క్రియేటివ్ కంటెంట్ తో పాపులర్ ఐన టాప్ 5 కామెడీ జంటల ఛానల్స్ గురించి చూద్దాం..రండి !
1) JENJOY BUDDY:
1) @JENJOY BUDDY: “ఆంధ్రా పెళ్ళాం VS తెలంగాణా మొగుడు” గా పాపులర్ ఐన వీరి చానెల్ పేరు మాత్రం JENJOY BUDDY అని వుంది, సరే.. ఇక వీరి Theme “ఆంధ్రా పెళ్ళాం VS తెలంగాణా మొగుడు” పేరులోనే మస్తు కామెడీ మెటీరియల్ ఉంటుందని తెలిసిపోతుంది కదా !
యంగ్ లుక్స్ తో కనిపించే, ఈ మిడిల్ ఏజ్ జంట.. JC & గౌతమి ల Tom and Jerry కిర్రాక్ యాక్టింగ్, Ttit forTat పంచులకి ఫిదా కాని వారు వుండరు. ఒకరిమీద ఒకరు గెలుస్తూ.. ఓడుతూ..ఎవరో ఒకరి చివరి పంచ్ కిక్ తో కామెడీని గెలిపిస్తూ..మనల్ని నవ్వుల్లో ముంచి తేలుస్తుంటారు. మంచి సినిమా కామెడీకి ఏమాత్రం తీసిపోని పక్కా కాన్సెప్ట్, దానికి తగ్గా స్క్రిప్ట్ వీరి ప్రత్యేకత. అలా వీరిద్దరి ఫన్నీ ఎక్సప్రెషెన్స్, మాటల్లో ఆంధ్రా వెటకారం – తెలంగాణా తెటకారం వల్ల, సబ్జెక్ట్ ఏదైనా స్కిట్ సూపర్ హిట్ అవుతుంది. పక్కా ఫన్ తో, ఫన్నీ సౌండ్స్ తో పాటూ సందర్బానుగుణంగా, అప్పుడప్పుడు ఎమోషనల్ ఫీల్ కూడా జోడించి ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చే వీరి చానెల్ ఇప్పటికీ 294 K SubScribers తో దూసుకుపోతుంది.
https://www.youtube.com/c/JENJOYBUDDY
2) NandusWorld :
2) @NandusWorld : ఈ తెలుగు UK NRI జంట, వారి పిల్లలతో సహా చేసే స్కిట్స్, పక్కా ఆంధ్రా వెటకారం యాసలో, చాలా రిచ్ క్వాలిటీతో ఉంటాయి. ఒక్క కామెడీనే కాకుండా, వీరి ఇంటి, వంటింటి, విషయాలు, పండగాపబ్బాలు, వూరు, టూరు, బేజారు విషయాలన్నిటి పై వీడియోలతో ఛానల్ ఫుల్ వెరైటీ కంటెంట్ తో..సూపర్ బజార్ లా ఉంటుంది. కామెడీతో పాటు చివర్లో ఒక కమర్షియల్ ఫ్యాషన్ యాపారం కూడా బోనస్ గా వుంటుంది. ఇందులో నందు మేడం గొంతు విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ, వాటిని అధిగమించి సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఈ ఛానల్ SubScribers ఇప్పటికి 660 K.
https://www.youtube.com/@NandusWorld
3) SSCOUPLEENTERTAINMENTS :
3) @SSCOUPLEENTERTAINMENTS : SS COUPLE గా పాపులర్ ఐన సంధ్య, శ్రీకాంత్ లు ఈడు జోడు కుదిరిన ముచ్చటైన జంట. వీళ్ళని మామూలుగా చూస్తే అస్సలు కామెడీ స్టార్స్ లా కనిపించరు కానీ, ఒక్కసారి స్కిట్స్ చూస్తే మాత్రం..అలా చూస్తూనే వుండాలనిపిస్తుంది. వాళ్ళు నవ్వకుండా, మనల్ని నవ్వించే, వీరిది కూడా ఇంటింటి మొగుడ్స్ & పెళ్లామ్స్ పంచ్ ఫలక్ నామా కామెడీ ఐనా ఎక్కడా బోర్ కొట్టకుండా.. నడిపించేస్తారు. వీడియో క్వాలిటీ, ఫ్రేమింగ్ క్లోజ్ అప్ & వైడ్ సీన్లు, ఎట్రాక్టీవ్ థంబ్ ఇమేజెస్ ఇంకా బాగా చేస్తే బెటర్, ప్రస్తుతం వీరి SubScribers 660 K
https://www.youtube.com/@SSCOUPLEENTERTAINMENTS
4) ThatTelugufamilyvlogs :
4) @ThatTelugufamilyvlogs : మరో తెలుగు ఎంగ్ NRI క్యూట్ జంట అఖిల & మార్టిన్, “రాయలసీమ అమ్మాయి – గుంటూరు అబ్బాయి” టైటిల్ తో రెండు ప్రాంతాల యాసలో సాగే వీరి మాటల ఫైట్ వెరైటీగా ఉంటుంది. ముఖ్యంగా అఖిల..పవర్ ఫుల్, షార్ట్ & టేక్ ఇట్ ఈజీ స్టైల్, చూసేకొద్దీ కొత్తగా అనిపిస్తుంది. దానికి ఆపోజిట్ గా మార్టిన్, స్లో & స్టడీ గా ఒదిలే పంచ్ లు కూడా ఆహా..అనిపిస్తాయి. ప్రస్తుతం వీరి SubScribers 560 K.
https://www.youtube.com/@ThatTelugufamilyvlogs
5) Achyuthasaddikuti :
5) @achyuthasaddikuti : “తింగరి పెళ్ళాం – తెలివైన మొగుడు” కాన్సెప్ట్ తో మొదలైన వీరి ఛానల్ క్రమంగా.. అత్తా, ఆడపడుచు, పిల్లలు, పనిమనిషి, ఇరుగూ పొరుగూ, ఊరి గొడవలూ అన్నీ కలుపుకొని ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ లా ఉంటుంది. ఇందులో మెయిన్ మేడం ‘అత్యుత’ సంప్రదాయ వ్యవహారం, నెల్లూరు యాసలో సాగదీసి పలికే తెలుగు డైలాగులూ బాగుంటాయి. ఇక ఈ తింగరి పెళ్ళాం తో.. తెలివైన మొగుడి తిప్పలు, యాక్టింగ్ లా కాకుండా చాలా సహజంగా, రక్తి కట్టిస్తాయి. ఇంకా ఒకడుగు ముందుకేసి, ఈ మేడం వేసే తింగరి గెటప్ లు.. “ఓరి ఈమె యాసాలో ” అనిపిస్తాయి. ఈమె ఛానల్ 186 మిలియన్ Subscribers తో అందరికన్నా టాప్ లో వుంది.
https://www.youtube.com/@achyuthasaddikuti
6) MeeSunaina :
6) @MeeSunaina : పై టాప్ 5 మేడమ్స్ తో పాటూ బోనస్ గా మరో సూపర్ మేడం కుడా వుంది. కనీ ఆమె, పై మేడమ్స్ లా జంటగా, ఫ్యామిలీ గుంపుతో కాకుండా, సివంగి లా సింగిల్ గా వచ్చి గర్జ్హించి, రచ్చ..రచ్చ చేస్తుంది. మరి ఎవరామె అని అనుకుంటున్నారా..! అదేనండి సినిమా బాలనటిగా పరిచయమై, అమ్మోరు గెటప్ తో అదరకొట్టిన అప్పటి బేబీ.. ఇప్పటి అంటీ సునయన. ఐతే ఈమె ఎంచుకున్న స్టైల్ “ఫ్రస్ట్రేషన్”.. ఆ ఫ్రస్ట్రేషన్ హావభావాలు, ఫటాఫట్ వడ్డించే వేడి వేడి తిట్ల, వాయనాలు, తట్టుకోడానికి వీడియోలో ఎవరూ వుండరు.. ప్రేక్షకులుగా అవన్నీ మనమే భరించాలి, భయపడి నవ్వుకోవాలి. అదీ విషయం. ఈమె ఛానల్ Subscribers 346 K
https://www.youtube.com/@MeeSunaina
ఆ విధంగా బాపూ గారితో పాపులర్ అయ్యి, ఆనాక అనేక కార్టూనిస్టులు రుద్దీ..రుద్దీ, వడ్డించిన అప్పడాల కర్ర “మొగుడూ – పెళ్ళాల” కార్టూన్ లకి కొనసాగింపుగా.. నేటి ఆధునిక సోషల్ మీడియాలో రూపాంతరం చెందిన యూట్యూబ్ ఇంటింటి ఫన్ రామాయణం..కామెడీ కమామీషూ..
మరో సరదా ఐటం తో.. మళ్ళీ కలుద్దాం _ సూర్య. SURYATOONS.COM