ఆహా..ఓహో..అబ్బబ్బ..ఏం చెప్తిరి..ఏం చేస్తిరి..నభూతో నభవిష్యత్..!
“అతి సర్వత్రా వర్జయేత్” అని లోకోక్తి.. అంటే ఏ విషయంలోనైనా ‘అతి’ (ఓవర్ యాక్షన్) పనికిరాదని అర్ధం. పురాణ కధల నుంచి ఇప్పటిదాకా..’అతి’ వల్ల కలిగే కష్టాలూ, నష్టాలు, అవమానాల గురించి వింటూనే వున్నాం. కర్ణుడు to మహానటి సావిత్రిల ‘అతి’ దానగుణం. దుర్వాసుడు to మోహన్ బాబుల ‘అతి’ కోపం..లాంటి ఎన్నో ఉదాహరణలు, వాటి పర్యవసానాలు మనకు తెలుసు.
ఇప్పుడు అదే ‘అతి’ మీడియాలో మితిమీరి రోతపుట్టిస్తుంది. ఒకప్పుడు Tv9 ఈ ‘అతి’కి ఆరంభం పలికితే.. నేడు సోషల్ సొల్లు మీడియా దానికి ఆజ్యం పోసి రాజేస్తోంది. ఇక సినిమా-సెలెబ్రిటీ విషయాలకి వస్తే..అది మరీ విర్రవీగే స్థాయికి చేరుతుంది. ఒకప్పుడు పత్రికలూ, వెబ్ సైట్ల రివ్యూస్ లలో కొంత లిమిట్ గా ఉండే..అంశాలు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ‘ వైరల్ ‘ అనే వ్యాధితో.. మనకు వణుకు తెప్పిసున్నాయి. వందల్లో యూట్యూబ్ ఛానల్స్, వేలల్లో ట్విట్టర్ ఎకౌంట్స్, లక్షల్లో పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, కోట్లలో వ్యూస్ యావలో పడి.. ప్రతీ దాన్ని ట్రేండింగ్ చేసే క్రమంలో..చేసే ఓవర్ యాక్షన్ అంతా.. ఇంతా కాదు.
బాహుబలిని కట్టప్ప చంపడం నుంచి మొదలైన.. ఈ సొల్లు మీడియా ‘అతి’ నిన్న మొన్నటి కార్తికేయ-2, కాంతారా వరకూ చూస్తూనే వున్నాం.
అలా రీసెంట్ గా సోషల్ మీడియా లో ‘అతి’ పొగడ్తలతో, చిర్రాకు పెట్టి, మతి పోగొడుతున్న అంశాలు.. ఒకటి RRR లో నాటు..నాటు..పాటకు ఆస్కార్ రావడం. రెండు ఒక కమెడియన్ తీసిన మొదటి సినిమా ‘బలగం’ ఊహించని హిట్ కొట్టడం.
OK.. పై రెండు విషయాలూ, తెలుగు సినీ పరిశ్రమ కీర్తికి మంచి సూచనలే, అభినందించ దగ్గ అంశాలే. కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది శృతిమించి ‘అతి’ ఐతే.. వినీ..వినీ.. చూసీ..చూసీ..విసుగు పుట్టడమే కాకుండా, ఏమాత్రం తేడా కొట్టినా, తర్వాత దాని పరిణామాలు వేరేలా ఉంటాయి.
RRR లో నాటు..నాటు..పాటకంటే..గొప్ప సాహిత్యం, ఫాస్ట్ బీట్ తెలుగు పాటలు అనేకం వచ్చాయి. కానీ వాటికి ఆస్కార్ ఎందుకు రాలేదు, ఈ ఆస్కార్ తెరవెనుక తతంగం ఏమిటీ ? వీటి గురించి ఎవ్వరూ నోరెత్తరు. ఏ అర్హత మీద సాధించాం అనేదానిపై ఆత్మ విమర్శ ఉండదు. ఇదేదో “పోకిరీ”లో డైలాగ్..”ఎలా గెలిచాం అన్నది కాదన్నాయ్..ఆస్కార్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్” అన్నట్లుంది. దీనివెనుక లోగుట్టు తెలిసిన వారు కాబట్టి రాజమౌళి, కీరవాణి, పెద్దగా ఎక్సయిట్మెంట్ కావట్లేదని చెపుతున్నా.. మన సోషల్ మీడియా.. ఓవర్ యాక్షన్ మాత్రం.. వేరే లెవెల్లో విరక్తి పుట్టిస్తుంది.
ఇదేదో “పోకిరీ” లో డైలాగ్..”ఎలా గెలిచాం అన్నది కాదన్నాయ్..ఆస్కార్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్” అన్నట్లుంది.
ఇక ఊహించని హిట్ కొట్టిన “బలగం” సినిమాకి వస్తే.. ఏ యాపారానికైనా, ఎవ్వారానికైనా..టాలెంటు తో పాటూ..కావాల్సింది ‘లక్’..’అదృష్టం’! మరి సినిమా..లాంటి క్రియేటివ్ ఫీల్డ్ లో ‘అదృష్టం’ ప్రభావం ఎంతవుంటుందో..అది కలిసిరాకపోతే..ఎంత డబ్బు పెట్టినా, మంచి కధ, డైరెక్టర్ వున్నా..సక్సెస్ కాక, మట్టికొట్టుకుపోయిన సినిమా ఉదాహరణలు ఎన్నోవున్నాయి.
ఎంతో లాజిక్, ప్రాక్టికల్ గా, మాట్లాడే..RGV నే..”నా హిట్ సినిమాలన్నీ యాక్సిడెంటల్, నా ప్లాప్స్ అన్నీ నా ఇంటెన్షనల్” అని చెప్పుకున్నాడు.
“లక్కుతో శివ సినిమాతీసి ..షోలే ని చెడకొట్టి..రాం గోపాల్ వర్మ డైరెక్టరా ఖర్మా” అని సెటైర్ పాటేసుకున్నా కిక్కురుమనలేదు.
అలానే..మొదటి సినిమా “అంకురం” తో, సెన్సేషనల్ డైరెక్టర్, అనిపించుకున్న ఉమా మహేశ్వర రావు, తన రెండవ సినిమా “మౌనం’ తో తెరమరుగైపోయాడు.
ఇలా చెప్పుకుంటూ పొతే.. లక్కుతో హిట్ ఐన సినిమాలూ.. అదృష్టం, కాలం కలిసిరాక ఫట్ ఐన సినిమాలూ, డైరెక్టర్లూ, యాక్టర్లూ.. అనేక ఉదాహరణలు వున్నాయి.
ఇక్కడ “జబర్దస్త్” కమెడియన్ వేణు, ఎంతోకాలంగా సినీ పరిశ్రమకు అనుబంధమైన, Tv మీడియాలో.. వున్నాడు. తెలంగాణా, భాష, యాస,జానపద సంస్కృతీ, సంప్రదాయాలపై మంచి పట్టు ఉన్నోడు. దానికి తోడు “లక్కీ” నిర్మాత దిల్ రాజు దొరకడం..కొత్త నటులైనా. వారి నటనకూడా అద్భుతంగా కధకి తోడవ్వడం..ఇలా అన్నీ కుదిరి..”బలగం” బొమ్మ అదిరింది. ఈ విషయాలన్నీ తెలిసిన సదరు డైరెక్టర్ వేణు, హుందాగా, వినయంగా వున్నా..మన మీడియా మాత్రం, అతన్ని ఆకాశానికి ఎత్తేసి, అందులో.. ప్రతి అంశాన్నీ..సెలెబ్రిటీలతో చిట్ చాట్ పెట్టి, తమకి తోచిన రీతిలో చించీ..చించీ.. విశ్లేషించి.. నానా హంగామా చేసేస్తుంది.
So.. ఫైనల్ గా..చెప్పోచ్చేమిటంటే..వేణు లాంటి అప్ కమింగ్, కొత్త డైరెక్టర్లు ఈ సొల్లు మీడియా, క్రియేట్ చేసే హైప్ మాయలో పడి పొంగిపోకూడదు. ఎందుకంటే.. రెండో ప్రయత్నంలో కొంచెం తిరగబడితే.. మళ్ళీ మీ వైపు కూడా చూడరు.
అలాగే ఈ సోషల్ మీడియా ‘అతి’ ని కంట్రోల్ చేసే ఆప్షన్ మనకు లేదు కాబట్టి, మనమే ఎంతవరకూ.. చూడాలో, వినాలో, స్వీయ నియంత్రణ పెట్టుకోవడం బెటర్. _సూర్య SURYATOONS.COM