Film Review

మొగ బతుకులక్కా..డెలికేట్ సామాన్లేసుకొని రోడ్లమీద తిరుగుతుంటాం.

Pl, Share This >>

మొగుడ్స్ & పెళ్లామ్స్ కామెడీ మూవీస్ :

తెలుగులో మొగుడ్స్ & పెళ్లామ్స్ కామెడీ సినిమాలకూ, టీవీ సీరియల్స్ కీ , కార్టూన్స్ కీ ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. ముక్యంగా సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్ “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” “ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, మిస్టర్ పెళ్ళాం” వెంకటేష్ ” ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు” కమల్ హాసన్ ” సతీ లీలావతి” అల్లరి నరేష్ “కితకితలు” సినిమాలు చేసిన కామెడీ సందడి, ఇంతా ఆంతా.. కాదు

తర్వాత, కంటెంట్ రొటీన్ ఐనా..బోర్ కొట్టకుండా,కామెడీ డోస్ మరింత పెంచేందుకు.. మల్టీ స్టారర్ సినిమాలు మొదలయ్యాయి. ఆంటే.. ముగ్గురు మొగుడూ పెళ్ళాల జంటలతో.. వచ్చిన “తిరుమల తిరుపతి వేంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్ళాం ఊరెళితే” లాంటివి కూడా మంచి కామెడీ కిక్ ఇచ్చాయి.

ఇక టీవీ సిరీస్ లలో కూడా, అమృతం, లాంటివి మంచి కామెడీని పంచి, మెప్పించాయి.

మళ్ళీ అదే కామెడీ ట్రెండు, ఇప్పుడు OTT లో..అదికూడా వెబ్ సిరీస్ ఫార్మాట్ లో మొదలయ్యింది. లేటెస్ట్ గా వచ్చిన “సేవ్ ది టైగెర్స్” (అంతరించిపోతున్న పులిలాంటి మొగుళ్ళ జాతి) వెబ్ సిరీస్ ఇప్పుడు మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది.

మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతమ్ క్రియేషన్ లో ప్రియదర్శి, అభినవ్ గోమతం, చైతన్య కృష్ణ ల భార్య పాత్రలతో పాటు..సునయన, పనిమనిషిగా జబర్దస్త్ ఫేం రోహిణీ కామెడీ కేక పుట్టించారు.

అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే .. ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నట్లు, ఈ వెబ్ సిరీస్ లో కామెడీ ఎంతబాగా పండిందో మచ్చుకు కొన్ని ఫన్నీ పటాస్ డైలాగులు చూస్తే చాలు..
* ఆడ దానికి పిర్రా.. మొగోనికి బొర్ర అందమే కదా !
* వద్దక్కా.. నువ్వు మా బతుకుల్ని లారీ కింద నిమ్మకాయలు చేయకు.
* జర చూస్కొని మెల్లగా చూసి నడుపు ! మొగ బతుకులక్కా..డెలికేట్ సామాన్లేసుకొని రోడ్లమీద తిరుగుతుంటాం.
లాంటివి ఈ సిరీస్ లో.. దాదాపు ప్రతి సీనులో ఫటాఫట్ పడుతూనే ఉంటాయి.

జబర్దస్త్ లోలా కేవలం కామెడీ పంచ్ డైలాగ్ లతోనే కాకుండా,మారుతున్న నేటి సమకాలీన సంసారాల గొడవలు, చదువుకున్న భార్యలతో ఇగోల గోల, కధ-కధనాలతో ఆద్యాంతం, ప్రతీ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.

ఆరు ఎపిసోడ్ల తో ఫస్ట్ పార్టు గా వచ్చిన ఈ “సేవ్ ది టైగెర్స్” చూసిన ప్రతి ఒక్కరూ, To be Continued.. పార్ట్ 2 కోసం, ఆత్రంగా ఎదురు చూడాల్సిందే.

-సూర్య SURYATOONS.COM


Pl, Share This >>

Leave a Reply