VIDEOS

RRR నాటు..నాటు..కు మించిన పాత పాటలు ! వాటికి ఆస్కార్ ఎందుకు రాలేదు ?

Pl, Share This >>

మన రాజమౌళి RRR, నాటు..నాటు పాట ఆస్కార్ అవార్డ్ ఫీవర్ కొంచెం తగ్గినా.. అసలా పాటలో ఆస్కార్ అవార్డ్ వచ్చేంత విషయం ఏముందా అనే ప్రశ్న మాత్రం ఇంకా సలుపుతూనే వుంది. పైగా ఈ మధ్యనే, ఓ సభలో, ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ మరియు మీడియా మొగల్ రామోజీరావు భక్తుడైన కీరవాణి మాట్లాడుతూ.. “ఈ అవార్డు పై తనకు పెద్దగా ఎక్సయిట్మెంట్ ఏమీ కలగలేదని, ఎదో రామోజీరావు గారు ముచ్చటపడ్డారు కాబట్టి, సాధించుకొచ్చినట్లు చెప్పడం. అలాగే గీత రచయిత చంద్రబోస్..కూడా ‘ఆహా’ వారి తెలుగు ఇండియన్ ఐడల్ కి గెస్ట్ గా వెళ్లి, ఆ పాట ప్రస్థానం, సాహిత్యం, ఏ బేస్ మీద ఆ పాటకు అవార్డు వచ్చిందో చెప్పకుండా, ఆ అవార్డు బొమ్మా- దిమ్మ బరువు కేజీలు, గ్రాముల్లో..చెప్పి సరిపెట్టేయడంతో.. పై ప్రశ్న.. ప్రశ్నగానే.. మిగిలిపోయింది.

మనలో చాలామందికి “రాజుగారి దేవతా వస్త్రాల” కధ తెలుసు కదా! సదరు రాజుగారు వేసుకోని “పప్పీ షేమ్” వస్త్రాలు, మేధావులకి మాత్రమే కనిపిస్తాయి, మూర్ఖులకి కనపడవు అని కండిషన్ వుండడంతో.. ఆ రాజుగారు, మొలతాడు కూడా లేకుండా, దిసమొలతో తిరుగుతున్నా, ప్రజలంతా మేధావుల్లాగా ఆ కనపడని బట్టలనే ” ఆహా ..ఓహో.. అద్భుతం” అంటూ డీజే కొట్టిన సంగతి తెలిసిందే.. సేమ్ to సేమ్ ఇక్కడకూడా.. ఈ నాటు..నాటు పాటకు ఆస్కార్ అవార్డు అంత సీనుందా..అని అనుకుంటున్నా, బయటకు చెపితే ఎక్కడ మూర్ఖులుగా ముద్రపడుతుందోనని, ఎవ్వరూ బైట పడకుండా, అందరూ మేధావుల్లాగా “ఆ..హుమ్..ఆ హుమ్” అని RRR ఆస్కార్ పల్లకీని మోసేస్తున్నారు.

నా ఊహ ప్రకారం, మన మీడియా పెద్దాయన రామోజీరావు ఎన్ని సినిమాలు తీసినా ఆస్కార్ దక్కకపోవడంతో, ఇప్పుడు అంపశయ్య పై భీష్ముడిలా, తన భక్తుడు కీరవాణిని ఆస్కార్ కోరడం, అదే తడవుగా..కీరవాణి + రాజమౌళి పూనుకొని ఆస్కార్ కొలతలకు తగ్గట్టుగా.. RRR చిత్రరాజమును తీసి, ఆస్కార్ కు పంపడం జరిగి ఉంటుంది. ఐనా.. మొత్తం సినిమాకి ఆస్కార్ దక్కకపోవడంతో, మిగిలిన విభాగాల్నిటికీ ప్రయత్నించి, విఫలమై, చివరికి..వారికి అర్ధంకాని భాషలో వున్న పాటకైనా ఆస్కార్ వచ్చేటట్టు “లాబీయింగ్” చేసి. పరువు దక్కించుకొని వుంటారు.

ఇక పాట సాహిత్యం విషయానికి వస్తే.. పల్లవిలో మొదటి నాలుగు నాటు..నాటు.. పదాలు తప్ప, మిగిలిన పాట మొత్తం ఎవ్వరికీ బుర్రకెక్కలేదు, నోటికి కంఠతా పట్టరాలేదు.. తెలుగు సినిమా పాటల పూతోటలో, ఇంతకన్నా అద్భుతమైన పాటలు ఎన్నో వున్నాయి, అంతెందుకు.. ఈ గీత రచయిత చంద్రబోస్ రాసిన వాటిల్లోనే, అనేక మంచి పాటలూ వున్నాయి, మరి వాటికెప్పుడూ రాని ఆస్కార్ దీనికెలా వచ్చిందో..? అంతా మాయ !

పోనీ ఇందులోని డైనమిక్ స్టార్ డ్యాన్సర్స్, రామ్ చరణ్ & Jr. NTR ల ఫాస్ట్ బీట్ స్టెప్పులకే, ఆస్కార్ వచ్చిందనుకుంటే.. అలాంటి పాటలూ మనకు దండిగానే..వున్నాయి. వాటిల్లో కొన్ని మచ్చుకు కొన్ని చూద్దాం..

ఈ వరుసలో.. మొదటిది.. ఎప్పుడో మన సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్స్ ఇరగతీసిన ” నేనంటే నేనే” సినిమా లోని “గుంతలకిడి..గుంతలకిడి..గుంతలకిడి..గుమ్మా” నుంచి, ఇప్పటివరకూ మస్తు పాటలు వున్నాయి..సరదాగా కింద వాటిని..ఓ లుక్కేసుకోండి.

1) పెటా ర్యాప్ | ప్రేమికుడు | ప్రభుదేవా-నగ్మా
2) ఛుకుబుకు. రైలే..| జెంటిల్ మేన్ | ప్రభుదేవా-గౌతమి
3) మన్మధరాజా | దొంగ దొంగది | మంచు మనోజ్స-దా
4) థిల్లానా..థిల్లానా..| ముత్తు | రజనీకాంత్-మీనా
5) కుర్రాడు బాబోయ్ | చిన్నల్లుడు | సుమన్-రంభ
6) హే పాప్పా..హో..పాప్పా | త్రినేత్రుడు | చిరంజీవి
7) చక్కటి చుక్కల | పసివాడి ప్రాణం | చిరు-విజయశాంతి
ఇలా చెప్పుకుంటూ పొతే మెగాస్టార్ చిరంజీవి పాటలే, కుప్పలు..కుప్పలుగా ఆస్కార్ రేంజ్ సాంగ్స్ ఉంటాయి. . మీరేమంటారు ?

_ సూర్య SURYATOONS.COM


Pl, Share This >>

Leave a Reply