RGV పై జొన్నవిత్తుల రాసిన తిట్ల దండకం
RGV.. పెద్దగా పరిచయం అక్కరలేని ఒక వివాదాస్పద వింత జీవి. విజయవాడలో ఇంజినీరింగ్ వెలగబెట్టి, పంజాగుట్టలో వీడియో లైబ్రెరీ ‘దందా’ లో పోలీసులకు బుక్కై, తన అదృష్టమో..(మన దురదృష్టమో) మొదటి సినిమా “శివ” తో ఒక ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యి, క్రమంగా బాలీవుడ్ లో సైతం టాప్ డైరెక్టర్ గా మెప్పించిన మొనగాడు.
అంతవరకూ బాగానేవుంది. తర్వాత..తర్వాత.. తన డైరెక్షన్ లో పస తగ్గి, ఎంచుకునే కధల విషయంలో గాడి తప్పి, అట్టర్ ఫ్లాప్ సినిమాలతో..అవకాశాలు తగ్గి, వెనుకపడిపోయాడు. సాధారణంగా, వేరే ఎవరికైనా.. ఈ పరిస్థితి వస్తే, వాళ్ళని దేకే’వాడు లేక తెరమరుగైపోతారు.
కానీ ఇక్కడ మనవాడి పబ్లిసిటీ రూటే సపరేటు, ఐన్రాన్డ్, ఓషో లాంటి వారి వెస్టర్న్ ఫిలాసఫీని, మైండ్ కెక్కించుకొని, దానికి పూర్తిగా భిన్నమైన మన (హిందూ) ఫిలాసఫీలో ఇమడలేక, మన పురాణాలు, లైఫ్ స్టైల్, సంస్కృతీ సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ..తన ట్విట్టర్, యూట్యూబ్, టీవీ డిబేట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఎవర్ గ్రీన్ సెలెబ్రిటీ లాగా వెలిగిపోతుంటాడు.
ఈ క్రమంలో తనతో, విభేదించే వారిని, వెటకారంగా సెటైర్స్ వేసి, కామెంట్స్ చేసి, తన సినిమాల్లో కామెడీ పాత్రలుగా పెట్టి, వారి అహాన్ని దెబ్బతీసి, ఓ రకమైన శాడిస్టు “శునకానందం” పొందుతుంటాడు. అలా తన బారినపడి అహందెబ్బతిన్న వారిలో ప్రముఖ కవి, పాటల రచయితా, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు కూడా వున్నారు.
జన్మతః సాంప్రదాయుడు, స్వతహాగా పండితుడూ.. ఐన జొన్నవిత్తుల తన అహం దెబ్బతీస్తే, ఊరుకుంటాడా !?
ఆల్రెడీ..కొన్ని దశాబ్దాల క్రితమే..RGV కి అతికినట్టు వుండే, “ఉష్..గప్ చుప్” సినిమాలో ..జొన్నవిత్తుల రాసిన “ఒరేయ్.. శుంఠ..” తిట్ల దండకం ఎంత పాపులర్ అయ్యిందో.. అందరికీ తెలుసు.
అదే ఊపులో ఇప్పుడు అచ్చంగా RGV కి కౌంటర్ ఇవ్వడానికే రాసిన, ఈ వీడియో సాంగ్.. “వోడ్కా మీద ఒట్టు.. నేన్ బాడ్కోవ్ నాకొడుకునీ” తప్పకుండా వినాల్సిందే..
ఇందులో కసితీరా RGV ని ఎంత తిట్టినా.. చివరికి “తల్లి కి మాత్రం మంచి కొడుకని” సంస్కారవంతంగా ముగించడం..జొన్నవిత్తుల గొప్పతనం. కానీ.. పవన్ కళ్యాణ్ ని శ్రీ రెడ్డి చేత “మాధచోద్” అని తిట్టించిన ఈ RGV “మేధోచోద్” కి ఈ డోస్ సరిపోతుందనుకోవడం, అర్ధం చేసుకునేంత, సెన్స్ ఉందనుకోవడం వేస్టే !
– సూర్య SURYATOONS.COM