E-Book

Hasyanandam October 2022 E-Book

Pl, Share This >>

Read Online / Download E-book from Official Website HASYANANDAM.COM వెబ్ సైట్ ద్వరా హాస్యానందం ఇ-బుక్ ని డౌన్లోడ్ చేసుకోండి.

హాస్యానందం అభిమానులకు…ఆప్తులకు…
హాస్యప్రియులకు, సన్నిహితులకు
దసరా, దీపావళి శుభాకాంక్షలు.

పండుగలు.. సంతోషానికి, ఆనందానికి హేతువులు. అయినవాళ్ళందరూ ఒకచోట కలసి ఆనందంగా గడపడమే ఈ పండుగల పరమార్ధం. కల్మషం లేని మనసులు..
అనురాగాలు.. మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి పునాదులు.
చెడుపై మంచి సాధించిన ఈ పండుగల పరమార్ధం గ్రహించి, మన ఆలోచనలు, మెరుగు పరుచుకుంటూ.. ‘మంచి’ భావనలతో అందర్నీ గౌరవిస్తే.. మన ప్రవర్తన ఎదుటివాళ్ళనే కాదు మనల్ని కూడా సంతోషంగా ఉంచుతుందనేది నిజం! ప్రతిరోజూ అందరితో కలవటం, గడపటం కుదరకపోవచ్చు… కాబట్టి కనీసం ఈ పండుగ రోజుల్లో అయినా అందరూ ఒక చోట కలిసి పలకరించుకుని కాలం గడిపితే.. ఆనందం ఎక్కడో వుండదు, మనం మలచుకునే మన జీవన విధానంలోనే వుంటుందనే విషయం బోధ పడుతుంది.

బాధాకరమైన విషయం ఏమిటంటే ‘కమ్యూనికేషన్ వ్యవస్థ’ ఇంతగా అభివృద్ధి చెందినా.. మనుషులు మధ్య ‘కమ్యూనికేషన్’ మాత్రం పెరగటం లేదు. ప్రస్తుతం మెసేజ్లతోనే సరిపెట్టుకుంటున్న మనం, ఒక్క నిముషం మాట్లాడితే ఎంత బాగుంటుందో అనుభవిద్దాం! అలా చేయకపోవటానికి కారణం ‘బిజీ’ అనే లాజిక్తో సమర్ధించుకుంటున్నాం గాని, మనం ఏం పోగొట్టుకుంటున్నామో తెలుసుకోలేక పోతున్నాం. నేను, నా కుటుంబం అనే భావన నుండి.. మనం, మన కుటుంబం అన్న భావనని అలవరచుకుందాం.. రోజూ కాకపోయినా ముఖ్యమయిన రోజుల్లో అయినా పలకరించడమో, కలవడమో చేసి, ఆత్మీయతను పెంచుకుంటూ, ఆనందం మన ‘చేతల్లోనే’ ఉంటుందని నిరూపిస్తూ.. పండుగ చేస్కుందాం! అందరూ హాయిగా.. ఆనందంగా.. ఆరోగ్యంగా.. ఉండాలని కోరుకుంటూ..

Hasyanandam-October-2022


Pl, Share This >>

Leave a Reply