Hasyanandam November 2022 E-Book
Read Online / Download E-book from Official Website HASYANANDAM.COM వెబ్ సైట్ ద్వరా హాస్యానందం ఇ-బుక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
హాస్యానందం అభిమానులకు..
ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్!.. మనం చాలా, సరదాగా ఈ మాటని ఎదుటివాళ్ళ విషయంలో తరచుగా. వాడేస్తుంటాం! కానీ ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవసిన మాట ఇది! మనం చేసే పనులు సిన్సియర్‌గా, ఎవరికోసమో అని కాకుండా మన కోసమే అనుకొని చేద్దాం!.. సకాలంలో జరగకపోతే ఆ పని తాలూక ఫలితం తారుమారు కావచ్చు!
ఉదాహరణకి మనం ఆదరాబాదరాగా తయారయ్యి, పరుగెత్తుకుంటూ, రొప్పుతూ రైల్వేస్టేషన్‌కెళ్ళే సరికి టైన్ వెళ్ళిపోతుంది… ఎక్కడుంది సమస్య?! ఇది మనం ఆలోచించాల్సింది!
శ్రద్ధ లేకుండా తప్పనిసరిగా చేసే పనుల పర్యావసానం ఇలానే ఉంటుంది. ఇంటిపనిలో అయినా, ఆఫీసుపనిలో ‘అయిన్నా, చదివే చదువైనా ఏదో చేసేశాం అని కాకుండా మనసు పెట్టిచేస్తే కచ్చితంగా ఫలితం. మనకు ఆనందాన్నిస్తుంది. పని చేసేటప్పుడు కష్టంగా ఉండొచ్చు గాక.. షార్ట్‌కట్‌లో తొందరగా. చేసేద్దాం అనుకుంటే మాత్రం ఆ ‘అనందం’ మన సాంతం కాదు! మనం ఏ పని చేసినా చిన్నపాటి. ప్రణాళికతో చేస్తే సకాలంలో అవడమేకాక పరిపూర్ణంగా పూర్తవుతుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు ఆ పనిని శ్రద్ధగా చేయాల్సిందే! ఖర్మకాలి ఈ పని చేస్తున్నామనుకొంటూ చేస్తే మనం పడిన శ్రమ వృధా అవడమే కాకుండా చేసిన ప్రయత్నం ఫలించదు! సరియైన సమయానికి…చిత్తశుద్ధితో పనులు చేద్దాం! ఫలితాలను ఆనందంగా అనుభవిద్దాం!
ఈ జీవితం మనది! ఇందులో వచ్చే కష్టసుఖాలకి బాధ్యులం మనమే అని గుర్తెరిగి ప్రవర్తిద్దాం!