Hasyanandam March 2023 E-Book
హాస్యానందం అభిమానులకు, ఆప్తులకు..
హాస్యప్రియులకు సన్నిహితులకు ఉగాది శుభాకాంక్షలు !
సృష్టికర్త మనుషుల్ని సృష్టిస్తూ.. సుఖసంతోషాలు మనుషుల కోసం ఎక్కడ అమర్చాలా.. అని ఆలోచిస్తూ.. ఆలోచిస్తూ – చివరకు మనుషులు పొందే ఆనందం, మనశ్శాంతి వారిలోనే పెట్టి.. దాన్ని ఎవరు గ్రహిస్తారో వారే సుఖసంతోషాలను పొందుతారని నిర్ణయం తీసుకున్నాడు. అదండి విషయం ! ఎక్కడెక్కడో అనందాన్ని వెతుక్కుంటూ నానాపాట్లు పడుతున్న మనం ఆ ‘పాయింట్’ని మిస్ అవుతున్నాం!
ఈ మధ్యకాలంలో మనుషులకు అసహనం చాలా సహజగుణం అయిపోయింది.. దాంతో స్నేహాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. తమ మాటే నెగ్గాలనే ‘అహం’ అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత తోడయ్యింది.. మరొక దురదృష్టం ఏమిటంటే… సోషల్ మీడియా ! వారి వారి భావజాలలాను మనుషులపై రుద్దీ వారికి లేని ప్రశాంతత మనకీ లేకుండా చేస్తున్నారు.. ప్రశాంతంగా ఆలోచించడానికి కూడా టైం లేకుండా పరుగెడుతున్న జనం – మనశ్శాంతి కోసం ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కోర్సులలో డబ్బులు కట్టీ మరీ చేరుతున్నారు. మనసారా నవ్వలేకుండా ఉన్నారు… నలుగురితో కలవలేక పోతున్నారు. కష్టసుఖాలు పంచుకోలేకపోతున్నారు.. కారణం తెలుసుకుని, కారణం లేకుండా గీసుకున్న ‘గీత’ని చెరిపేస్తే ఆనందం మన వెంటే ఉంటుందనేది సత్యం! ఎలాంటి భేషజాలు లేకుండా ‘మనవాళ్ళ’తో మాట్లాడదాం!.. భావాలు పంచుకుందాం.. మనం కనిపెట్టిన ఈ ‘మనశ్శాంతి’ అందరికీ పరిచయం చేద్దాం ! అసహన రహిత సమాజం కోసం ఈ రోజు నుంచే ప్రయత్నంచేద్దాం ! దైవం ఏర్పరచిన.. మన హృదయాలలోనే వున్న ‘ఆ’ ‘మనశ్శాంతి’ కనిపెట్టడానికి ఈ కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుని, సుఖసంతోషాలను మన సొంతం చేద్దాం !
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా
ఉండాలని కోరుకుంటూ..