Hasyanandam June 2023 E-Book
హాస్యానందం అభిమానులకు…ఆప్తులకు..
హాస్యప్రియులకు సన్నిహితులకు
హాస్యాభివందనాలు!
పళ్ళ చెట్లకే రాళ్ళ దెబ్బలు! – మనం తరచు వినే సామేత! మన జీవితాలకు ఈ సామెతని అన్వయించుకుంటే సరిగ్గా సరిపోతుంది. మనం పది పనులు చేసినప్పుడు అందులో ఒకటి పొరపాటున తప్పయిందనుకోండి… ఇక అంతే! సరిగ్గా చేసిన తొమ్మిది పనులు వదిలేసి, ఆ ‘ఒక్క’ తప్పునే ఎత్తి చూపుతూ నానా రభస చేస్తారు. చాలామందికి ఈ ‘గుణం’ ఉంటుంది. ఎదుటి వాళ్ళలో తప్పులు ఎత్తి చూపడమే తమ నైజంగా ప్రవర్తిస్తుంటారు. వీరి ముఖ్యోద్దేశం ఎదుటివాళ్ళ ‘గొప్ప’తనం అంగీకరించలేకపోవడమే! ఉదాహరణకి మనం ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పామనుకోండి… ‘ఆ అవును నాకతను తెలుసు.. ఎప్పుడూ ఆడవాళ్ళని అదోలా చూస్తుంటాడు. వట్టి వెధవ!’ అని పుసుక్కున అనేస్తారు… ఒక్క ‘అతనే’ మహామనిషిలా ఫీలైపోతూ! మనం ఏం చేసినా అందులో వంకలు వెతకటమే వీరి జీవితాశయంగా ఉంటుంది. మళ్ళీ తప్పు అని చెప్పే వీళ్ళకి ‘రైట్’ ఏమిటో తెలియదు. ఎలా చేయాలో తెలియదు. ఎదుటివాళ్ళని తక్కువ చేయడమే వీరి మానసిక స్థితి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఇలాంటి వాళ్ళ మాటలు విని మనం బాధ పడాల్సిన అవసరం లేదు. మనం ‘ఆ’ పనిని ఎంత ‘సిన్సియర్’గా చేసామో గుర్తెరిగి, అలాంటి ‘పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడటమే మన కర్తవ్యం! ఎవరు ఎలాంటి వాళ్ళో… విమర్శలు చేస్తున్న వారి ఉద్దేశం ఏమిటో కాస్త లౌక్యంగా కనిపెట్టగలిగి, వారిని దూరంగా పెట్టగలిగితే మన ‘పనులు’ ప్రశాంతంగా, ఉత్సాహంగా చేయగలుగుతాం!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ…..
Hasyanandam-June-2023