Hasyanandam December 2022 E-Book
Read Online / Download E-book from Official Website HASYANANDAM.COM వెబ్ సైట్ ద్వరా హాస్యానందం ఇ-బుక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
హాస్యానందం అభిమానులకు..
‘ఆప్తులకు.. హాస్యప్రియులకు,
సన్నిహితులకు హాస్యాభివందనాలు!
ప్రతిదానికీ ఒక పరిధి ఉంటుంది.. కానీ ఆలోచనలకు, మాత్రం ‘పరిధి’ ఉండదు. మన ఆలోచన(ఆరోగ్యకరమైన)
పరిధి ఎంత విసృతమైతే మన ఎదుగుదల అంత ఉన్నతమౌతుంది. ఒక చట్రం ఏర్పరచుకుని అందులోనే ఉంటూ పరిమితమైన ఆలోచనలతో గడుపుతూ ఇవే గొప్ప సిద్ధాంతమనుకునే వారు ‘ఆ’ చిన్ని ప్రపంచానికే పరిమితమైపోతారు.
‘ఏ పనైనా చేస్తూంటేనే అందులో లోటుపాట్లు తెలుస్తాయి.. కొత్త కొత్త విషయాలు అవగాహనలోకి వస్తాయి.. ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం.. చేసే కృషి మన ఆలోచనలను పదును పెట్టి, నలుగురిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయి. మనంఏర్పరచుకున్న కొన్ని లిమిటేషన్స్‌ని దాటి ఆలోచిద్దాం.. ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఎదుగుదాం!
పత్రికల్లో మంచి మంచి రచనలు చదివి ఆనందించి ఊరుకోక.. వాళ్ళని అభినందిస్తూ.. పత్రిక వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ.. అలా రచనా వ్యాసాంగానికి దగ్గరై.. చిన్న పిల్లల కథలు రాయడం మొదలెట్టి.. వాస్యకథలకి కేరాఫ్ అడ్రస్‌గా మారి, తెలుగుసాహితీ రంగంలో ఓ స్థానం ఏర్పరచు. కున్న శ్రీకోనే నాగ వెంకట ఆంజనేయులు గారు అభినందనీయులు. ఇప్పటికీ ఒక మంచి. రచనగానీ, కార్టూన్ చూస్తే ఆ వ్యక్తులు పరిచయం లేకున్నా వారిని అభినందించే సంస్కారం. ఆయనకి ఆభరణం! ఈ ప్రత్యేక సంచిక రూపొందించడానికి ప్రేరణ ఇదే! ఉత్తరాలతోనే ‘ఆగిపోయుంటే ఈ యాభై ఏళ్ళ సాహితీ ప్రస్థానం సాగేదా?.. ఇన్ని మంచి కథలు మనకందించే వారా?.. ఎదుటి వారి సక్సెస్ నుంచి మనంనేర్చుకోవలసినది ఇదే!.. అదే మన ఆలోచనలని ఎదగనివ్వడం!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, కోరుకుంటూ..
సంపాదకీయం లో చాల చక్కగా చెప్పారు. ప్రతివ్యక్తీ తన పరిధులు దాటి అలోచించడం అలవాటుచేసుకోవాలి. జీవజాలంలో మానవునికొక్కనికే మేధస్సు అనేది ప్రసాదించబడింది. మన పూర్వీకులు ఎంతో అలోచించబట్టే మనం ఈనాడు ఇంత సాంకేతిక విఙానం సాధించగలిగాము. ముందు తరాలవారికి ఇంకా ఎక్కువ విఙానం అందించాలంటే మన తరం మేధస్సు ఉపయోగించడం తప్పనిసరి అవుతుంది.