Artist Chandra Special Issue E Book PDF
తెలుగునాట టీవీ మీడియా రాకముందు, ప్రింట్ మీడియా స్వర్ణ యుగంలో మెరిసిన, వడ్డాది పాపయ్య, బాపుల తర్వాతి తరం ఆర్టిస్టుల్లో, బాలి,చంద్ర, మోహన్, కరుణాకర్, ఉత్తమ్, సాయికృష్ణ , పీ ఎస్ బాబు, గోపిలు ప్రముఖులు. వీరిలో ఎవరికీ వారే హేమాహేమీలు అనిపించుకున్నా, వారిలో చంద్ర గారి చిత్ర శైలి మాత్రం ప్రత్యేకమైనది.
బొమ్మ అనగానే బాపు గుర్తొస్తారు, బాపు తర్వాత ఇంకెవరు అంటే.. చంద్ర తప్ప మరో మాట వినపడదు. చిత్ర కళా ప్రపంచానికి బాపు సూర్యుడైతే చంద్ర ఓ పున్నమి చంద్రుడు.
మూడు పువ్వులు, ఆరుకాయలు అన్న చందంగా, చంద్ర బొమ్మలు మూడు ముఖ చిత్రాలు, ఆరు కార్టూన్లు, అరవై కథా చిత్రాలు గా అలరించినరోజులవి. అప్పట్లో అనేక పత్రికలకు ఆయనే ఆస్థాన చిత్రకారుడు.
కళాభిమానుల కనులకు విందుగా, వర్ధమాన చిత్రకారులకు రెఫెరెన్స్ కలెక్షన్ గా, కథా, కవితలు, సీరియల్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా, మనసునికట్టిపడేసే, అద్భుత చిత్రాలు ఎన్నో.. ఎన్నెన్నో..
చంద్ర, చిత్రకారుడిగానే కాకుండా, ఒక రచయిత, కార్టూనిస్ట్, నటుడు, ఆర్ట్ డైరెక్టర్ గా కూడా, తన ప్రతిభను కనబరచి, మల్టి టాలెంటెడ్ కళారుడిగా, సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందారు.ఈయన కళ నచ్చి బి. నరసింగరావు తన ‘రంగుల కల’లో కూడా ఆర్టిస్టు పాత్రనే ఇచ్చారు..
ఆర్టిస్ట్ చంద్ర ప్రత్యేక సంచికతోపాటు..
వారి బొమ్మలతో కనువిందు చేసే ఈ వీడియోని కూడా చూసి ఎంజాయ్ చేయండి. _ సూర్య
