Hasyanandam May 2024 E Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!
కార్టూనిస్టు మిత్రులకు తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు!
తొలి తెలుగు కార్టూనిస్టు శ్రీతలిశెట్టి రామారావు జన్మదినాన్ని (మే,20) పురస్కరించుకుని గత పదమూడేళ్ళుగా మహామహుల అండదండలతో హాస్యానందం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం వైభవంగా నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా డాక్టర్ కె.వి. రమణగారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నాం.
తలిశెట్టి రామారావు అవార్డు, శేఖర్ అవార్డు, బాపురమణ పురస్కారంతో పాటు ఈ యేడాది ‘హాస్యానందం ఫుల్ పిల్లర్’ కళారత్న బ్నింగారు కొత్తగా ఒక పోటీ నిర్వహించారు. మన కార్టూనిస్టులు మంచి మంచి కార్టూన్లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్టూనిస్టు మిత్రులందరికీ అభినందనలు.
ఈ పండగ హైదరాబాద్, రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్లో మే, 20న జరుగుతుంది. ఈ కార్టూనిస్టుల పండుగ వైభవంగా జరగడానికి సహకరిస్తున్న మా డా|| కె. వి. రమణగారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
అలానే హాస్యానందం పై తమ అభిమానం చాటుకుంటూ ఈ మహోత్సవానికి వన్నె తెస్తున్న తెలంగాణరాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్, శ్రీ మామిడి హరికృష్ణగారికి, శ్రీ తనికెళ్ళ భరణిగారికి, ‘బాపురమణ అకాడమీ’ సుబ్బరాజుగారికి, ఈ కార్యక్రమాల సమన్వయకర్త శ్రీబ్నిం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ సభకి అతిథులుగా పాల్గొంటున్న ప్రముఖ నటులు శ్రీహర్షవర్ధన్ గారికి, ప్రసిద్ధ కార్టూనిస్టు, సాహిత్యకారులు శ్రీ సుధామగారికి, సాంఘిక సేవకురాలు శ్రీమతి సత్యవాణి గారికి కృతజ్ఞతలు.
ఈ సందర్భంగా హాస్యానందం వేదికగా కార్టూనిస్టులను ప్రోత్సహిస్తున్న ‘కార్టూన్ ఇష్టుల’కు ప్రతియేటా ‘కార్టూన్ మిత్ర’ పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించాం. ముందుగా గత పది సంవత్సరాలుగా ప్రతినెలా ఒక కార్టూన్‌కి 1000 రూపాయలు చొప్పున బహుమతి ఇస్తున్న శ్రీ కె.వి.వి సత్యనారాయణగారిని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.
కార్టూన్ పోటీల్లో బహుమతులు పొందిన కార్టూన్లతో పాటు, హాస్యానందంలో గత యేడాది ప్రచురించిన కార్టూనిస్టుల కార్టూన్లతో ఈ ప్రత్యేక సంచిక రూపొందించడం జరిగింది. ఎప్పట్లానే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ.. మీ అభిరుచికి అనుగుణంగా పత్రికని రూపొందించడానికి కృషి చేస్తాను అని తెలియజేస్తూ..
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
