Hasyanandam August 2023 E-Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!
మంచి మనసుతో ఆలోచిస్తే మంచి మంచి ఆలోచనలే వస్తాయి. ‘అందరూ బాగుండాలి… ప్రతి ఒక్కరూ ఎదుటి వారి పట్ల స్నేహభావంతో ఉండాలి’ అనే ఆలోచన ఎంతో గొప్ప ఆలోచన! ఇది ఎంత మంది ఆచరిస్తున్నాం?!.. బాధాకరమైన విషయం ఏమిటంటే నీతులు చెప్పేవారు.. ఏం చేయాలో చేయకూడదో చెప్పే ‘గొప్ప’వారు కూడా ఇలా ఆలోచించటం లేదేమోనని సందేహం! అసలు ఈ ‘గొప్పవారు’ అంటే ఎవరు? వారిని మనం గొప్ప వారిగా గుర్తించి, గౌరవించటానికి వారికుండే అర్హత ఏమిటి?.. ఇదీ మనం ఆలోచించవలసిన విషయం! దేవుళ్ళ గురించి చెప్పేవాళ్ళా? డబ్బులు దానం చేసే వాళ్ళా? రాజకీయ నాయకులా? ప్రముఖ వ్యక్తులా?.. నిజంగా వీరందరూ గొప్ప వ్యక్తులేనా? వీరు చేసే పనులన్నీ గొప్పవేనా?…లేక గొప్పగా ‘మాత్రమే’ కనిపిస్తాయా?.. అందరినీ ఎక్కువ తక్కువ కాకుండా సమభావంతోనే గౌరవిస్తారా? చిత్తశుద్ధితో మంచి ఆలోచనలతో ఎదుటివారిని బాధించే విధంగా కాకుండా ప్రవర్తించే వ్యక్తులే నిజంగా గొప్పవాళ్ళు! మనం ఎన్ని మాటలు విన్నా అందులో మంచినే గ్రహిద్దాం.. అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉందాం! మంచిగా నటించేవాళ్ళ పట్ల జాగ్రత్త వహిద్దాం!.. పాజిటివ్ ఎనర్జీని అలవర్చుకుని మన ‘విజ్ఞతతో మంచిగా ఆలోచిస్తూ, గొప్ప వ్యక్తిత్వం సంతరించు కుని ఆ ‘గొప్పతనం’ మన స్వంతం చేసుకుందాం!..
చాలామంది సోకాల్డ్ గొప్పవాళ్ళకంటే మనం గొప్పగా ఉందాం!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..