ఈ యూట్యూబ్ బ్యూటీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో..చూడండి !
ఇంతకుముందు ఆర్టికల్ లో బెస్ట్ 5 కామెడీ మేడమ్స్ & వాళ్ళ ఫన్నీ మొగుడ్స్ గురించి చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక యూట్యూబ్ బ్యూటీ ‘ఇందు’ మేడం గురించి చూద్దాం. ఈమె అందరిలా, కామెడీకో, వంటలకో, వ్లోగ్స్ కో పరిమితం కాకుండా.. తన ఫ్యామిలీ సెంటిమెంట్ కంటెంట్ తో, నవరసాల నటనతో, ఎమోషనల్ డ్రామాని రక్తికట్టించి, ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. అతితక్కువ బడ్జెట్ తో, మొబైల్ లోనే, అవలీలగా తల్లీ – కూతురుగా డబుల్ రోల్ జాలీగా చేసేస్తుంది.
చూపు తిప్పుకోలేని అందం, పెద్దపెద్ద కళ్ళ అభినయంతో, తన స్లిమ్ & బ్యూటీ ఫిగర్ కి తగ్గ డ్రస్, చీర కట్టుతో.. యూట్యూబ్ లో “మహానటి”లా యమ క్రేజ్ సంపాదించుకుంది. తన భర్తాపిల్లలూ..మధ్యతరగతి జీవితంలోని ఒడుదుడుకులనే కధాంశాలుగా తీసుకొని, తూర్పు గోదావరి యాసలో.. యేటి.. మరేటి..అంటూనే దేశ, విదేశాల తెలుగోళ్ల అభిమానం కొల్లగొట్టి, 2.53 M subscribers తో, తన యూట్యూబ్ ఛానెల్ ని, నెం.1 స్థానంలో నిలబెట్టింది. So గ్రేట్ కదా..మీరుకూడా ఆమె వీడియోస్ ని వీక్షించి, అల్ ది బెస్ట్ చెప్పేయండి. – సూర్య SURYATOONS.COM