Waste to Wonders Creative Crafts
ప్రతిరోజూ మన దినచర్య ప్రారంభమయ్యేది ఇల్లు వాకిలి శుభ్రం చేయడంతోనే ఐనప్పటికీ, ఇంకా ఏంతోకొంత చెత్త ఇంట్లో పేరుకుపోతూనే ఉంటుంది.
వారానికో, నెలకో, పండగాపబ్బానికో, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు, కొత్త వస్తువులు కొన్నప్పుడు, మూలనపడిన పాత వస్తువులు, ఆ కొత్త వస్తువులతోపాటూ వచ్చిన ప్యాకింగ్ అట్టపెట్టెలు, వాటిలో రకరకాల ఆకారాల ధర్మాకోల్ షీట్లు, ఫుడ్, గిఫ్ట్ ప్యాక్ బాక్స్ లు, కూల్ డ్రింక్ పెట్, ప్లాస్టిక్ బాటిల్స్, ఐరన్, స్టేషనరీ ఐటమ్స్..పాత బట్టలు, పారేయడానికి మనసొప్పని ఎన్నో పాత జ్ఞాపకాల బొమ్మలు..ఇలా ఒకటేమిటి, ఏ ఇంట్లో అటకలమీద, స్టోర్ రూమ్స్ లో చూసిన ఎన్నోరకాల చెత్త సరుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
అలా చెత్తని చూసి భయపడకుండా, కొంతమంది తమలోని క్రియేటివిటీతో, ఆ చెత్తనుంచి కూడా ఎదో ఒక కళా రూపాన్ని, లేదా రీసైక్లింగ్ ఐడియాతో మరో కొత్త వస్తువునీ సృష్టించి, WOW అనిపిస్తుంటారు. So.. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే..అలాంటి కొన్ని మంచి ఐడియాలనీ, ఆర్ట్ ఐటమ్స్ నీ ఈ “Waste తో Wonders” శీర్షికలో చూపించడం జరుగుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
దీనితో మీలో ఎవరికైనా స్ఫూర్తి కలిగితే, మీ క్రియేటివిటీకి పదునుపెట్టి, కొత్త ఐటమ్స్ సృష్టించి “Waste తో Wonders” క్రియేటివ్ క్రాఫ్ట్స్ ద్వారా అందరితో పంచుకోవచ్చు.
దీనిపై, మీ స్పందన, మీ ఆవిష్కరణ వివరాలు, కింద కామెంట్ లో లేదా Mail: hasyanandam.web@gmail.com పంపించవచ్చు.
మొదటగా..ఇక్కడ పాత జీన్స్ తో జిగేల్ మనిపించే హ్యాంగింగ్ ఐటమ్ చెసే వీడియో వుంది, చూడండి..